Abn logo
Dec 3 2020 @ 21:35PM

కేంద్రానికి మమతా బెనర్జీ హెచ్చరిక

కోల్‌కతా: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకుంటే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రైతుల జీవితాలు, వారి జీవనోపాధి గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు చెప్పిన మమత.. రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలని ట్వీట్ చేశారు. ఈ రైతు వ్యతిరేక బిల్లులను ఆరంభంలోనే తాము వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేపు (శుక్రవారం) ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ  సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పిన మమత..  నిత్యావసర వస్తువుల చట్టం ప్రభావం సామాన్య ప్రజలపై ఎలా పడుతోందన్న విషయాన్ని చర్చిస్తామన్నామన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రజావ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement