విద్యుత్తు బిల్లుపై మోదీకి మమత ఘాటు లేఖ

ABN , First Publish Date - 2021-08-07T22:54:39+05:30 IST

విద్యుత్తు సవరణ బిల్లు, 2020ని పార్లమెంటులో ప్రవేశపెట్టొద్దని పశ్చిమ

విద్యుత్తు బిల్లుపై మోదీకి మమత ఘాటు లేఖ

కోల్‌కతా : విద్యుత్తు సవరణ బిల్లు, 2020ని పార్లమెంటులో ప్రవేశపెట్టొద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ డిమాండ్ చేశారు. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో, పారదర్శకంగా చర్చలు జరిగేలా చూడాలని కోరారు. 


విమర్శల పాలవుతున్న విద్యుత్తు సవరణ బిల్లు, 2020ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తాజా ప్రయత్నాలపై తాను మరోసారి నిరసన తెలియజేసేందుకే ఈ లేఖను రాస్తున్నట్లు మమత తెలిపారు. తాను గత ఏడాది జూన్ 12న రాసిన లేఖలో లేవనెత్తిన అంశాలను మోదీకి గుర్తు చేశారు. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు గత ఏడాదిలో ప్రయత్నం జరిగిందని తెలిపారు. ఈ బిల్లులోని ప్రజా వ్యతిరేక అంశాలను అనేక మంది లేవనెత్తారన్నారు. దీనిలోని అన్ని ముఖ్యమైన లోపాలను తాను తన లేఖలో వివరించానన్నారు. 


తాము లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోకుండా, ఈ బిల్లును మళ్ళీ పార్లమెంటులో ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు తెలుసుకుని నిర్ఘాంతపోయానని చెప్పారు. 


Updated Date - 2021-08-07T22:54:39+05:30 IST