గంగా సాగర్ మేళాలో కోవిడ్ ఆంక్షలు ఉండవు : మమత బెనర్జీ

ABN , First Publish Date - 2021-12-30T22:03:32+05:30 IST

గంగా సాగర్ మేళాలో ఎటువంటి కోవిడ్ సంబంధిత

గంగా సాగర్ మేళాలో కోవిడ్ ఆంక్షలు ఉండవు : మమత బెనర్జీ

కోల్‌కతా : గంగా సాగర్ మేళాలో ఎటువంటి కోవిడ్ సంబంధిత ఆంక్షలు ఉండబోవని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పారు. కుంభ మేళా జరిగినపుడు ఇటువంటి ఆంక్షలేమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్, బిహార్, ఇతర సుదూర ప్రాంతాల నుంచి గంగా సాగర్ మేళాలో పాల్గొనేందుకు వచ్చేవారిని ఎలా ఆపగలమని అడిగారు. 


పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపంలో 2022 జనవరి 8 నుంచి 16 వరకు గంగా సాగర్ మేళా జరుగుతుంది. అత్యంత ప్రజాదరణ, ప్రసిద్ధిగల మేళాల్లో ఇదొకటి. వేలాది మంది భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తారు. 


ఈ మేళాకు ఏర్పాట్లపై మమత బెనర్జీ మంగళవారం సమీక్షించారు. కోవిడ్ సంబంధిత సూచనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల కార్యకలాపాలను పరిశీలించేందుకు, రద్దీని నివారించేందుకు సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లను ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


Updated Date - 2021-12-30T22:03:32+05:30 IST