కోల్‌కతా: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో గెలిచి నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారని పశ్చిమబెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి జోస్యం చెప్పారు. ప్రజలు మోదీ పక్షానే ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాజకీయ సలహాదారు సలహాలతో ప్రధాని కావాలని కలలు కంటున్నారని సువేందు ఎద్దేవా చేశారు. జాతీయగీతాన్ని అర్ధాంతరంగా ఆపించి అవమానించిన మమతపై అవసరమైతే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేస్తామన్నారు.