‘భారత్‌ మమతను కోరుకుంటోంది’

ABN , First Publish Date - 2022-05-15T08:12:54+05:30 IST

జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టేందుకు తృణమూల్‌ కాంగ్రె్‌స(టీఎంసీ) పార్టీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అధ్యక్షురాలు మమత బెనర్జీని

‘భారత్‌ మమతను కోరుకుంటోంది’

మమత బెనర్జీని ప్రధాని రేసులో ఉంచేందుకు టీఎంసీ ప్రచారాస్త్రం


కోల్‌కతా, మే 14 : జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టేందుకు తృణమూల్‌ కాంగ్రె్‌స(టీఎంసీ) పార్టీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అధ్యక్షురాలు మమత బెనర్జీని ప్రధాన మంత్రి రేసులో ఉంచేందుకు కొత్త ప్రచారానికి తెరలేపింది. ‘దేశం మమతను కోరుకుంటోంది(ఇండియా వాంట్స్‌ మమతాదీ)’ అనే నినాదాన్ని ఎంచుకుంది. ఇందుకు విస్త్రత ప్రచారం కల్పించేందుకు ఇండియా వాంట్స్‌ మమతాదీ(ఐడబ్ల్యూఎం) పేరిట ఓ వెబ్‌సైట్‌ను కూడా తయారు చేసింది. టీఎంసీ ఎంపీ డిరెక్‌ ఓబ్రియన్‌ ఆ సైట్‌ను శనివారం ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ భావజాలాన్ని నమ్మేవారికి ఐడబ్ల్యూఎం ఓ వేదిక అని ఆ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు ప్రాంతీయ పార్టీలతో జత కట్టి థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు మమత చాలాకాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క, టీఎంసీ నెట్‌ ప్రాక్టీ్‌సకు మాత్రమే పరిమితమని, బరిలోకి దిగదని బీజేపీ అధికార ప్రతినిధి సామిక్‌ భట్టాచార్య విమర్శించారు. బీజేపీకి వ్యతిరకంగా టీఎంసీ గతంలోనూ అనేక ప్రచారాలు చేసిందని వెల్లడించారు.

Updated Date - 2022-05-15T08:12:54+05:30 IST