బాపట్ల: మున్సిపల్ డీఈగా బాపట్ల అభివృద్ధి పనులను చాకచక్యంగా నిర్వహించి ఈఈగా ఉద్యోగోన్నతి పొందిన కె.మాల్యాద్రిని అధికారులు స్ఫూర్తిగా తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. స్థానిక కోన భవన్లో మాల్యాద్రికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడుతూ మంచి అధికారిగా అభివృద్ధికి అన్నివిధాలా కృషిచేసిన మాల్యాద్రి నరసరావుపేట పురపాలక సంఘానికి వెళ్ళటం సంతోషదాయకమన్నారు. అనంతరం మాల్యాద్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైసీపీ పట్టణాధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరరావు, టీపీవో ఇ.శ్రీలక్ష్మి, మాజీ కౌన్సిలర్లు షేక్.సయీద్ పీర్, కాగిత సుధీర్‌బాబు, వైసీపీ నాయకుడు ఇనగలూరి మాల్యాద్రి, మున్సిపల్ సిబ్బంది, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.