హయత్‌నగర్, జనవరి 19(ఆంధ్రజ్యోతి): తుర్కయంజాల్ మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం బుధవారం చైర్ పర్సన్ మల్‌రెడ్డి అనురాధ రాంరెడ్డి అధ్యక్షతన జరిగింది. పట్టణ-ప్రగతి, 15వ ఆర్థిక సంఘం, ఎంపీఎల్ జనరల్ ఫండ్, ఎల్‌ఆర్‌ఎ్‌సకు చెందిన రూ. 14.33 కోట్లతో వివిధ అభివృద్ధ్ది పనులు జరుగనున్నాయి. ఈ సందర్భంగా 138 అభివృద్ధ్ది పనులకు కౌన్సిల్ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతో కూడిన పనులు చేయాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ హరిత, కమిషనర్ జ్యోతి, ఫ్లోర్ లీడర్ కొవిక ఐలయ్య, ఽకల్యాణ్‌నాయక్, కౌన్సిలర్‌లు ధన్‌రాజ్, రొక్కం అనిత, మాధవి, మంగమ్మ, కవిత, కీర్తన, బాల్‌రాజ్, జ్యోతి, ఉదయశ్రీతో పాటు పలువురు పాల్గొన్నారు.