మల్లు స్వరాజ్యం పార్థివదేహాన్ని నల్గొండ మెడికల్ కాలేజీకి అప్పగింత

ABN , First Publish Date - 2022-03-20T23:33:48+05:30 IST

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్థివదేహాన్ని నల్గొండ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు అప్పగించారు.

మల్లు స్వరాజ్యం పార్థివదేహాన్ని నల్గొండ మెడికల్ కాలేజీకి అప్పగింత

నల్గొండ: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్థివదేహాన్ని నల్గొండ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు అప్పగించారు. అనారోగ్యం, వయసు రీత్యా ఎదురయ్యే సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మల్లు స్వరాజ్యంను ఈ నెల 1న  హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చేర్చారు. కొద్ది రోజుల చికిత్స తర్వాత ఆరోగ్యం మెరుగుపడడంతో.. ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చారు.  శుక్రవారం ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచారు. శనివారం రాత్రి 7.35కు స్వరాజ్యం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. 


మల్లు స్వరాజ్యం ప్రస్తుత సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెంలో 1931లో జన్మించారు. తల్లిదండ్రులు చొక్కమ్మ, రామిరెడ్డి. వీరిది 500 ఎకరాలు కలిగిన భూస్వామ్య కుటుంబం. స్వరాజ్యం నాలుగో తరగతి వరకు చదివారు. పదేళ్ల వయసులో సొంత భూమిలో పండిన పంటను పేదలకు పంచారు. అనంతరం తల్లి చొక్కమ్మ ప్రోత్సాహం కూడా తోడవడంతో విప్లవోద్యమం వైపు అడుగులేశారు.

Updated Date - 2022-03-20T23:33:48+05:30 IST