Aug 21 2021 @ 16:49PM

ఓనమ్‌ ఫెస్టివల్: మలయాళ భామల హోయలు!

కేరళ ప్రజలకు ఓనమ్‌ ప్రత్యేక పండుగ. ఆగస్ట్‌ చివర్లో, సెప్టెంబర్‌ మొదటివారంలో వచ్చే ఈ పండుగను కేరళవాసులు పదకొండురోజులపాటు అత్యంత వైభవంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈ నెల 12న మొదలైన ఈ వేడుక 23న తిరువోనం, మహాబలి కార్యక్రమాలతో పూర్తవుతుంది. పది రోజులకు పైగా జరిగే ఈ పండుగలో మగువలు సంప్రదాయ దుస్తులు ధరించి, ఇంటి ముందు రంగురంగుల పూల ముగ్గులు వేసి మధ్యలో దీపం వెలిగిస్తారు. దీనిని ‘పూకోలం’ అంటారు. ఈ పండుగ రోజున మలయాళీలు నిర్వహించే ‘ఓనసద్యా’ అనే విందు చాలా ముఖ్యమైనది. వారం రోజులుగా మల్లూ భామలు ఓనం పండుగను వైభవంగా జరుపుకొంటున్నారు. ఓనమ్‌ అగోషం (సెలబ్రేషన్స్‌) అంటూ నెట్టింట్లో ఫొటోలతో సందడి చేశారు. స్టార్‌ హీరో మోహన్‌లాల్‌, కథానాయికలు కీర్తి సురేశ్‌, అనుపమా పరమేశ్వరన్‌, కల్యాణి ప్రియదర్శిన్‌, మంజిమా మోహన్‌, మాళవిక మోహనన్‌, మమతా మోహన్‌దాస్‌, పూర్ణ, సంగీత దర్శకుడు గోపీసుందర్‌ తదితరులు సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. ప్రముఖ గాయని కె.ఎస్‌ చిత్ర ఓనమ్‌ సందర్భంగా ప్రత్యేకంగా పాడిన పాటలను యూట్యూబ్‌లో విడుదల చేశారు.  


టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, జాన్వీ కపూర్‌ తదితరులు మలయాళ నటులకు, ప్రజలకు ఓనమ్‌ శుభాకాంక్షలు తెలిపారు. 


గత ఏడాది కొవిడ్‌ 19 విపత్కర పరిస్థితుల్లో ప్రాణాల్ని లెక్కచేయకుండా కరోనా సోకిన వారికి సేవలు అందించిన  నర్సులకు మల్లూ తారలంతా శుభాకాంక్షలు తెలిపి, ఓనం పూకోలం(పూల ముగ్గు)ను నర్సులకు డెడికేట్‌ చేసిన సంగతి తెలిసిందే! Keerthi suresh


Nivetha Thomas


Anupama parameswaran


Mohan lal


Priya prakash varrier


Kalyani priyadarshan


Namitha pramod


Manjima mohan


Mamtha mohan das


Poorna


Malavika mohanan


Janhvi kapoor