మరికాసేపట్లో రాజ్యసభలో మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్‌లో విపక్షాల భేటీ

ABN , First Publish Date - 2021-12-20T15:23:54+05:30 IST

మరికాసేపట్లో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్‌లో విపక్షాలు భేటీ కానున్నాయి. నేటి నుంచి 23 వరకూ పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్షాలు చర్చించనున్నాయి.

మరికాసేపట్లో రాజ్యసభలో మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్‌లో విపక్షాల భేటీ

న్యూఢిల్లీ : మరికాసేపట్లో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఛాంబర్‌లో విపక్షాలు భేటీ కానున్నాయి. నేటి నుంచి 23 వరకూ పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై విపక్షాలు చర్చించనున్నాయి. 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తి వేయాలని నిరసనను కొనసాగిస్తున్నాయి. లిఖింపూర్ ఖేరీ వ్యవహారంపై గత వారం తీవ్ర స్థాయిలో నిరసన తెలిపాయి. రెండు రోజుల పాటు సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. ఈ వారం లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నాయి. చర్చలకు రావాలని కొన్ని పార్టీలకు మాత్రమే ఆహ్వానం పాలకడంపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-12-20T15:23:54+05:30 IST