Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 02 Aug 2022 14:12:37 IST

Mallika Sherawat: నేను కమిట్‌మెంట్ ఇవ్వలేదని.. ఆ స్టార్ హీరోలు నాతో సినిమా చేయడానికి ఒప్పుకోలేదు

twitter-iconwatsapp-iconfb-icon

‘మర్డర్’, ‘హిస్‌స్’ వంటి సినిమాలతో బాలీవుడ్‌లో పాపులారిటీ సాధించిన బ్యూటీ మల్లికా శెరావత్ (Mallika Sherawat). ఈ బ్యూటీ ఏ విషయం గురించైనా మొహమాటం లేకుండా మాట్లాడుతుంటుంది. అవసరమైతే బోల్డ్ స్టేట్‌మెంట్‌లు చేయడానికి కూడా వెనుకాడదు. దాదాపు రెండు దశాబ్దాలుగా నటిగా కొనసాగుతున్న ఈ బ్యూటీ బోల్డ్ సినిమాలతో మంచి గుర్తింపు సాధించింది. గతకొంతకాలంగా తక్కువగా సినిమాలు చేస్తున్న ఈ భామ.. ఇటీవల వరుసగా ఓ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నటి తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆర్‌కే/ఆర్‌కాయ్’ అనే మూవీ చేస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మల్లిక మాట్లాడుతూ.. బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 


మల్లిక మాట్లాడుతూ.. ‘ఏ లిస్ట్‌లో (స్టార్ హీరోలు) ఉన్న హీరోలందరూ నాతో పనిచేయడానికి నిరాకరించారు. దానికి కారణం నేను రాజీపడకపోవడం. వారు నియంత్రించగలిగే, వారితో రాజీపడే నటీమణులతో పని చేయడానికిమ మాత్రమే వారు ఇష్టపడతారు. నేను అలా కాదు. నా వ్యక్తిత్వం అది కాదు. నేను ఎవరి ఇష్టాయిష్టాలకు, ఆవేశాలు, అవసరాలకు లొంగాలనుకోలేదు. వాళ్లు కూర్చోమంటే కూర్చోవాలి. నిలబడమంటే నిలబడాలి. తెల్లవారుజామున 3 గంటలకు హీరో ఫోన్ చేసి నా ఇంటికి రా అని పిలిస్తే వెళ్లాలి. ఆ సర్కిల్‌లో ఉంటేనే వారి సినిమాలో అవకాశం ఇస్తారు. ఒకవేళ పిలిచినప్పుడు మీరు వెళ్లకపోతే మిమ్మల్ని సినిమా నుంచి తీసేస్తారు. కానీ దాని కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను’ అని ఘాటుగా చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా.. కొన్ని వారాల క్రితం దీపికా పదుకొనే (Deepika padukone) నటించిన ‘గెహ్రైయాన్’ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మల్లిక మాట్లాడింది. ‘ఆ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి దీపికా పలు రోమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. చాలామంది ఆమె నటనపై ప్రశంసలు కురిపించారు. కానీ.. 2004లో ఇమ్రాన్ హష్మితో కలిసి మర్డర్ సినిమాలో రోమాంటిక్ సన్నివేశాల్లో నటించడం చాలామందికి నచ్చలేదు. దీంతో చాలా విమర్శలు చేశారు. మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు. దీపికలాగా నన్ను కూడా ఎందుకు ప్రశంసించలేదో నాకు అర్థం కావడం లేదు’ అని తెలిపింది. కాగా.. ఈ బ్యూటీ ప్రస్తుతం వరుసగా ‘కంట్రాక్ట్’, ‘పోలీస్ టైగర్’, ‘జీనాత్’, ‘పంబట్టం’ సినిమాలు చేస్తూ కెరీర్‌లో మళ్లీ బిజీగా మారుతోంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement