ఏసీబీ డైరెక్టర్‌గా మల్లారెడ్డి

ABN , First Publish Date - 2020-12-05T10:15:05+05:30 IST

ఏసీబీ డైరెక్టర్‌గా విశ్రాంత ఐజీ బి.మల్లారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండే ళ్ల పాటు ఆయన ఈ పోస్టులో కొనసాగుతారని జగన్‌ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన జీఓ లో పేర్కొంది.

ఏసీబీ డైరెక్టర్‌గా మల్లారెడ్డి

తెలంగాణ విశ్రాంత ఐజీకి ఏపీలో కీలక పోస్టు


అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఏసీబీ డైరెక్టర్‌గా విశ్రాంత ఐజీ బి.మల్లారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రెండే ళ్ల పాటు ఆయన ఈ పోస్టులో కొనసాగుతారని జగన్‌ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన జీఓ లో పేర్కొంది. తెలంగాణలో పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఏండీగా పనిచేసిన ఆయన 2 నెలల క్రితం పదవీ విరమణ చేశారు. వైఎ్‌సతో సన్నిహిత సంబంధాలు కలిగిన మల్లారెడ్డిని జగన్‌ ప్రభుత్వం ఏసీబీలో కీలకమైన స్థానంలో నియమించడం విశేషం. నాలుగైదు రోజుల్లో ఆయన బాధ్యత చేపట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ నియామకంపై అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. విశ్రాంత ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ఓఎ్‌సడీలుగా నియమించడం సాధారణంగా జరుగుతున్నదే. అయితే అత్యంత కీలకమైన ఏసీబీకి డైరెక్టర్‌గా, అందునా పొరుగు రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన అధికారిని కూర్చోబెట్టడం ఎంతవరకు సబబు? అంటూ పలువురు అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2020-12-05T10:15:05+05:30 IST