మల్లన్న పాగాకు ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-03-08T04:57:53+05:30 IST

పంచారామ క్షేత్రం క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి రోజు అర్ధరా త్రి లింగోద్భవ సమయంలో (12 గంటల కు) ఆలయ శిఖరం నుంచి గాలి గోపు రానికి అనుసంధానం చేస్తూ ఏకవస్త్రం (మల్లన్నపాగ)కు ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మల్లన్న పాగాకు ప్రత్యేక పూజలు
మల్లన్న పాగకు పూజలు చేస్తున్న భక్తులు

పాలకొల్లు అర్బన్‌, మార్చి 7: పంచారామ క్షేత్రం క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి రోజు అర్ధరా త్రి లింగోద్భవ సమయంలో (12 గంటల కు) ఆలయ శిఖరం నుంచి గాలి గోపు రానికి అనుసంధానం చేస్తూ ఏకవస్త్రం (మల్లన్నపాగ)కు ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్న పాగాను దగ్గులూరుకు చెందిన వరదా సోమలింగం నుంచి నేత నేస్తున్నారు. ఆయన కుమారుడు సోమేశ్వరరావు, రామకోటి మాణిక్యం 363 మూరల పాగాను 18 అంగుళాల వెడల్పుతో 363రోజులు భక్తి శ్రద్దలతో నేస్తారు. శివరాత్రి ముందు వివిధ గ్రామాల్లో గ్రామోత్సవం జరిపి ఆలయానికి శివరాత్రి రోజున తీసుకువస్తారు. ఆదివారం పట్టణంలోని బొక్క రమాకాంత్‌, రాజేశ్వరి నివాసానికి తీసుకురాగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు నుదురుపాటి శ్రీనివాసరావు, భక్తులు చినమిల్లి గణపతిరావు, డి శ్రీనివాసరావు, వలవల బ్రహ్మయ్య, నాగలక్ష్మి, కేతా లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-08T04:57:53+05:30 IST