మల్లన్న మహాజాతర

ABN , First Publish Date - 2022-01-15T05:24:49+05:30 IST

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం పట్నంవారానికి సంసిద్ధమైంది. గత డిసెంబరు 26న నిర్వహించిన కల్యాణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన విషయం విధితమే. ఆదివారం పట్నంవారంతో మూడునెలల జాతరకు అంకురార్పణ పడనుంది. 11 వారాల పాటు ప్రతీ ఆదివారం వేడుకలు అంగరంగ వైభవంగా సాగనున్నాయి.

మల్లన్న మహాజాతర

రేపు కొమురవెల్లిలో పట్నంవారం 

మూడునెలల జాతరకు అంకురార్పణ

హైదరాబాద్‌ నుంచి తరలిరానున్న భక్తులు 


చేర్యాల, జనవరి 14: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం పట్నంవారానికి సంసిద్ధమైంది. గత డిసెంబరు 26న నిర్వహించిన కల్యాణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన విషయం విధితమే. ఆదివారం పట్నంవారంతో మూడునెలల జాతరకు అంకురార్పణ పడనుంది. 11 వారాల పాటు ప్రతీ ఆదివారం వేడుకలు అంగరంగ వైభవంగా సాగనున్నాయి. 

సంక్రాంతి పర్వదినం తరువాత వచ్చే మొదటి ఆదివారాన్ని పట్నంవారంగా పిలుస్తుండటం అనాదిగా వస్తోంది. యాదవుల ఆడబిడ్డ అయిన మేడలాదేవిని మల్లన్న వివాహమాడిన నేపథ్యంలో యాదవులకు ఈవారం అత్యంత ప్రీతికరం. ఈవారానికి హైదరా బాదుకు చెందిన యాదవ భక్తులు ఇంటిల్లిపాది  శనివారం చేరుకుంటారు. కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోకుండానే స్వామివారిని నేరుగా ధూళి, దర్శనం చేసుకుంటారు. ఆదివారం తెల్లవారుజామునే తలనీలాలు అందించి పుణ్యస్నానమాచరిస్తారు. భక్తిప్రపత్తులతో బోనం తయారుచేయడానికి స్థానికంగానే కూరగాయలు, మట్టికుండలు కొనుగోలు చేస్తారు. సంప్రదాయబద్ధంగా మల్లన్నకు బెల్లంపాయసంతో బోనం తయారుచేసి పట్నంవేసి సహఫంక్తి భోజనం చేస్తారు. స్వామివారిని దర్శించుకుని ఒడిబియ్యాలు సమర్పిస్తారు. అలాగే స్వామివారి తోబుట్టువు అయిన ఎల్లమ్మ దేవతకు బోనాలు చేసి నివేదిస్తారు. మరుసటి సోమవారం రోజున హెదరాబాద్‌కు చెందిన యాదవపూజారులసంఘం ఆధ్యర్యంలో పెద్దపట్నం వేసి అగ్నిగుండాలను దాటుతారు. మల్లన్నను ఇత రుల రూపంలో భావించి వంటినిండా పసుపు ధరించి స్వామివారి ఆవాహనంతో అగ్నిగుండాలలో చిందేసి తన్మయత్వం చెందు తారు. తరువాత వచ్చే ఆదివారాన్ని లష్కర్‌వారంగా పిలుస్తారు. 


ఈసారి 11 వారాల జాతర

గతంలో మల్లన్న ఆలయంలో కేవలం ఈమూడునెలల కాలంలో ఏడువారాల్లోనే జాతర కొనసాగేది. దీంతో సత్తేటి వారాల జాతర అని పిలిచేవారు. అప్పట్లో భక్తుల రద్ధీ అంత ఎక్కువగా లేకపోవడంతో మూడునెలలు మాత్రమే ఆలయం తెరిచి ఉండేదని, మిగతారోజులలో మూసిఉండేదని పెద్దలు చెబుతుంటారు. కాలక్రమేణా ఏయేటికాయేడు భక్తుల రాక అధికమవుతుండటంతో జాతర సమయంతో పాటు సాధారణ రోజుల్లోనూ ఆలయం రద్ధీగా మారుతుంది. తిథుల ఆధారంగా బ్రహ్మోత్సవాలు కొనసాగను న్న నేపథ్యంలో ఒక్కోయేటా వారాలసంఖ్య పెరగడం, తగ్గడం జరుగుతూ వస్తోంది.. ఈక్రమంలో ఈయేడు 11వారాలపాటు జన జాతర సాగనుంది.

కరోనా కేసుల విజృంభణతో సోమవారం నిర్వహించ తలపెట్టిన పెద్దపట్నం, అగ్నిగుండాలను రద్దుచేస్తున్నట్లు దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశించినట్లు ఆలయాధికారులు ఇటీవల వెల్లడించారు. అయితే మాస్క్‌ ధరించడంతో పాటు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ చూపిస్తేనే మల్లన్న దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించారు.


అగ్నిగుండాలు, పెద్దపట్నం రద్దు

కరోనా కేసుల విజృంభణతో సోమవారం నిర్వహించ తలపెట్టిన పెద్దపట్నం, అగ్నిగుండాలను రద్దుచేస్తున్నట్లు దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశించినట్లు ఆలయాధికారులు ఇటీవల వెల్లడించారు. అయితే మాస్క్‌ ధరించడంతో పాటు వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ చూపిస్తేనే మల్లన్న దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించారు.


టికెట్ల రీ-సైక్లింగ్‌ను అరికడతారా?

చేర్యాల : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో రేపటి నుంచి జాతర ప్రారంభంకానుండగా ఈఏడాదైనా ఆలయాధికారులు అవకతవకలను అరికట్టేనా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఏటా జాతరలో పలువురు వలంటీర్లను తాత్కాలికంగా రోజువారీ భృతి అందించి నియమించుకుంటున్నారు. వారిపై ఆలయాధికారులు, పాలకమండలి పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రత్యేక దర్శన, ప్రసాద టికెట్ల రీ-సైక్లింగ్‌కు పాల్పడుతూ ఆలయ ఆదాయానికి గండికొడుతున్నారు. వారికి ఆలయాధికారులు, ధర్మకర్త లేదా ప్రజాప్రతినిధి అభయహస్తం అందిస్తుండటంతో ఘటనలు పునరావృతమవుతూవస్తున్నాయి. కాగా వలంటీర్లకు డ్యూటీలు వేసే ఆలయాధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జాతరలో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అయితే గతంలో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు సిబ్బంది టికెట్ల రీ-సైక్లింగ్‌ చే స్తూ పట్టుబడటంతో ఈసారి వారికి అవకాశం ఇవ్వడం లేదని ఈవో బాలాజీ తెలిపారు. స్థానికంగా ఉన్న ఏపీజీవీబీ, ఇండియన్‌బ్యాంకు సిబ్బందిచే టికెట్లను జారీ చేయించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2022-01-15T05:24:49+05:30 IST