- ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు
కేశంపేట, మే21: కేశంపేట మండలం ఎక్లా్‌సఖాన్‌పేట గ్రామంలో శనివారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో మల్లన్న బోనాలు నిర్వహించారు. కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్, సర్పంచ్ కవిత యాదవ్, టీఆర్‌ఎస్ యువ నాయకుడు మురళీకృష్ణలు ప్రత్యేకంగా అలంకరించిన బోనాలతో మల్లన్న ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒగ్గు కళాకారులు మల్లన్న జీవిత చరిత్రను వివరిస్తూ బోనాల ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, గ్రామస్తులు పాల్గొన్నారు.