వార్షిక బడ్జెట్ టీడీపీకి మింగుడు పడట్లేదు: మల్లాది విష్ణు

ABN , First Publish Date - 2022-03-19T20:21:27+05:30 IST

నగర పాలక సంస్థ వార్షిక బడ్జెట్ టీడీపీకి మింగుడు పడటం లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.

వార్షిక బడ్జెట్ టీడీపీకి మింగుడు పడట్లేదు:  మల్లాది విష్ణు

విజయవాడ: నగర పాలక సంస్థ వార్షిక బడ్జెట్ టీడీపీకి మింగుడు పడటం లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా వార్షిక బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. టీడీపీ సభ్యులు బడ్జెట్ ప్రవేశపెడుతుంటే అడ్డుకున్నారని మండిపడ్డారు. సభలో మేయర్ ఛై‌ర్‌కు కనీసం గౌరవం ఇవ్వడం లేదన్నారు. టీడీపీ హయాంలో పన్నుల భారాలు మోపి  ప్రజల నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా టిడ్కో ఇళ్ల పేరుతో అవినీతికి పాల్పడ్డారన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేక టీడీపీ నేతలు సభలో రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. లక్షకు పైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని చెప్పారు. జగన్ పాలనలో నగరం అభివృద్ధి పథంలో నడుస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 

Updated Date - 2022-03-19T20:21:27+05:30 IST