Abn logo
Oct 28 2021 @ 03:42AM

మాలిక్‌ను ‘జీజా జీ’ అంటూ..

దుబాయ్‌: టీ20 వరల్డ్‌క్‌పలో తొలి మ్యాచ్‌లో భారత్‌ను పాకిస్థాన్‌ చిత్తుగా ఓడించింది. అయి తే, ఈ మ్యాచ్‌లో పాక్‌ ఆటగాడు, సానియా మీర్జా భర్త అయిన షోయబ్‌ మాలిక్‌ను టీమిండియా ఫ్యాన్స్‌ ‘జీజా జీ (బావగారు)’ అని సంబోధిస్తూ సందడి చేశారు. బౌండ్రీ వద్ద మాలిక్‌.. ఫీల్డింగ్‌ చేస్తుండగా అభిమానులు ఇలా పిలుస్తున్న వీడియోను నెటిజన్‌ ఒకరు ట్వీట్‌ చేశారు. ఇదే క్లిప్‌ను సానియా రీట్వీట్‌ చేసి సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం మీర్జా.. పాక్‌ టీమ్‌ బయోబబుల్‌లో ఉంది.