పురుషులు... మాంసాహారమే ఎక్కువ

ABN , First Publish Date - 2022-05-18T02:03:11+05:30 IST

ఎక్కువ మంది పురుషులు గత ఆరేళ్లలో మాంసాహారాన్నే అధికంగా తీసుకున్నారని జాతీయ ఆరోగ్య సర్వే గణాంకాలు చెబుతున్నాయి.

పురుషులు... మాంసాహారమే ఎక్కువ

న్యూఢిల్లీ : ఎక్కువ మంది పురుషులు గత ఆరేళ్లలో మాంసాహారాన్నే అధికంగా తీసుకున్నారని జాతీయ ఆరోగ్య సర్వే గణాంకాలు చెబుతున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే... 15-49 ఏళ్లలోపు పురుషుల్లో 83.4 శాతం మంది వారానికో రోజు, లేదా  అప్పుడప్పుడూ మాంసాహారం తింటారు. గత ఆరేళ్లలో ఎక్కువ మంది భారతీయ మహిళలు మాంసాహారం తినడం ప్రారంభించారు. కాగా... 20155-16, 2019-21 మధ్య కాలంలో ఈ సంఖ్యలు బాగా నమోదయ్యాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(NHS) గణాంకాలు చెబుతున్నాయి.


చేపలు, కోడి మాంసం, లేదా... ‘మాంసం'గా పేర్కొనబడిన ఆహార పదార్ధాలను పురుషులే ఎక్కువ ఆసక్తికరంగా తీసుకుంటారని వెల్లడైంది. రెండు దశల్లో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారు. కాగా... 2015-16 గణాంకాల ప్రకారం 15-49 ఏళ్లలోపు 83.4 శాతం మంది పురుషులు రోజూ, వారానికోసారి, లేదా...  అప్పుడప్పుడూ మాంసాహారం తింటున్నారని, 2015-16 లో 78.4 శాతం మంది మాంసాహారాన్ని తీసుకునే పురుషులు రికార్డు స్థాయిలో పెరిగారని డేటా వెల్లడించింది. మహిళల విషయానికొస్తే, HFHS-4 లో 70 శాతం నుండి NHFS-5లో 70.6 శాతం, అంటే... 0.6 శాతం(స్వల్ప పెరుగుదల) మాత్రమే నమోదైంది. అప్పుడప్పుడు, లేదా... వారానికి ఒకసారి మాంసం తినేవారి సంఖ్య పురుషులలో 48.9 శాతం నుండి 57.3 శాతానికి పెరిగింది. మహిళల్లో ఈ పెరుగుదల కేవలం 2.3 శాతం మాత్రమే. మాంసాహారం తినేవారిలో అత్యధికంగా లక్షద్వీప్‌లో(98.4 శాతం), అత్యల్పంగా రాజస్థాన్‌లో(14.1 శాతం) ఉన్నారు.


అండమాన్ అండ్ నికోబార్ దీవులు, గోవా, కేరళ, పుదుచ్చేరి తదితర  దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు కూడా అత్యధికంగా మాంసాహారం తినే జనాభాను కలిగి ఉన్నాయి. ఈ జాబితాలో రాజస్థాన్‌తో పాటు హర్యానా, పంజాబ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అట్టడుగున ఉన్నాయి. వారానికి ఒకసారి మాంసాహారం తినేవారి జనాభా సిక్కింలో గత కొన్నేళ్ళుగా భారీగా పెరిగింది. త్రిపురలో భారీగా తగ్గింది. ఇక సామాజికవర్గాల వారీగా చూస్తే... క్రైస్తవ పురుషులు, మహిళలు(15-49 ఏళ్ల మధ్య వయస్సున్న వారు) వారానికోమారు మాంసాహారాన్ని తప్పనిసరిగా  వినియోగిస్తున్నారు, హిందూ పురుషులు 52.5 %, మహిళలు  40.7 %; ముస్లిం పురుషులు 79.5 %, మహిళలు: 70.2 %,  సిక్కు పురుషులు 19.5 %, మహిళలు 7.9 %, బౌద్ధ/నియో-బౌద్ధ పురుషులు: 74.1 %, మహిళలు 62.2 %, జైన పురుషులు 14.9 %, స్త్రీలు: 4.3 % మాంసాహారాన్ని వినియోగిస్తున్నారు.


అంతేకాకుండా... 2019-21 లో ఎరేటెడ్ డ్రింక్స్ వినియోగించే వారి సంఖ్య 2-15-16 లో పురుషుల్లో 88.3 శాతం, మహిళల్లో 83.5 శాతం నుండి 86.4 శాతం తగ్గింది. వేయించిన ఆహారాన్ని తినే వారి నిష్పత్తి స్త్రీలలో 95.6 శాతం, పురుషుల్లో 92.6 శాతంగా  ఉంది. పప్పులు/బీన్స్, ఆకు కూరలు, పండ్లు - 2019-20 లో దాదాపు 100 శాతం మంది జనాభా ప్రతిరోజూ, వారానికోసారి, లేదా...  అప్పుడప్పుడు వినియోగిస్తున్నారు. అలాగే, 96.2 శాతం మంది పురుషులు, 94.2 శాతం మంది మహిళలు పాలు/పెరుగును రోజూ, వారానికోసారి తీసుకుంటారని సర్వేలో వెల్లడైంది. 

Updated Date - 2022-05-18T02:03:11+05:30 IST