లెస్బియన్ అమ్మాయిగా ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి లక్షలు కాజేసిన కాలేజీ విద్యార్థి.. అతడేం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-16T05:54:58+05:30 IST

డిగ్రీ బిఎస్సీ చదువుకునే ఒక అబ్బాయి ఇన్స్‌టాగ్రామ్‌లో లెస్బియన్ అమ్మాయిగా ఫేక్ ఐడీ క్రియేట్ చేసి అమ్మాయిలను మోసం చేసి లక్షలు కాజేసాడు. కానీ బాధితులలో ఒకమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి బండారం బయటపడింది...

లెస్బియన్ అమ్మాయిగా ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి లక్షలు కాజేసిన కాలేజీ విద్యార్థి.. అతడేం చేశాడంటే..

డిగ్రీ బిఎస్సీ చదువుకునే ఒక అబ్బాయి ఇన్స్‌టాగ్రామ్‌లో లెస్బియన్ అమ్మాయిగా ఫేక్ ఐడీ క్రియేట్ చేసి అమ్మాయిలను మోసం చేసి లక్షలు కాజేసాడు. కానీ బాధితులలో ఒకమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి బండారం బయటపడింది. 


వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ప్రపంచ్ నాచప్ప(21) బిఎస్సీ చదువుతున్నాడు. కొన్ని నెలల క్రితం అతను ఇన్స్‌టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇన్స్‌టాగ్రామ్‌లో తన ఫొటోకు బదులు ఒక అందమైన అమ్మాయి ఫొటో పెట్టి.. తనని తాను ఒక లెస్బియన్ అమ్మాయిగా కొంత అమ్మాయిలకు పరిచయం చేసుకున్నాడు. అమ్మాయిలతో రోజూ చాటింగ్ చేసి వారికి బాగా చేరువయ్యాడు. ఆ తరువాత వారికి మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి.. ఆడిషన్ల కోసం నగ్న ఫోటోలు పంపమన్నాడు. ఒక్క ఫోటోకు రూ.4,000 ఇప్పిస్తానని నమ్మబలికాడు.

నాచప్పను ఒక లెస్బియన్‌ భావించి ఆ అమ్మాయిలు అతడు అడిగినట్టు తమ నగ్న ఫొటోలు పంపించారు.  ఆ తరువాత నాచప్ప మరో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి వారిని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఒక్కో అమ్మాయి వద్ద రూ.4,000 నుంచి రూ.5,000 డబ్బు డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే వారి నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. అలా దాదాపు 30 నుంచి 40 మంది అమ్మాయిలను మోసం చేసి భారీగా సొమ్ము చేసుకున్నాడు. 

సాఫీగా నాచప్ప పని జరిగిపోతున్న సమయంలో అతని ద్వారా బాధింపబడిన ఒక అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాధితురాలు ఏ బ్యాంకు అకౌంట్‌కు డబ్బు పంపించిందో ఆ అకౌంట్ వివరాలు సేకరించారు.  అలా బ్యాంకు అకౌంట్ ఆధారంగా నాచప్పను జనవరి 14న పోలీసులు అరెస్టు చేశారు.

కష్టపడకుండా.. సులువుగా సంపాదన కోసం పెడదారిలో వెళ్లే వారి పరిస్థితి చివరికి ఏమవుతుందో.. నాచప్పను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Updated Date - 2022-01-16T05:54:58+05:30 IST