మగ ఎలుకలకు అరటి అంటే అసహ్యం.. ఆడ ఎలుకలకు ఇష్టం.. ఎందుకలా?

ABN , First Publish Date - 2022-05-31T14:17:49+05:30 IST

ఎలుకలు అరటిపండ్లను అసహ్యించుకుంటాయి.

మగ ఎలుకలకు అరటి అంటే అసహ్యం.. ఆడ ఎలుకలకు ఇష్టం.. ఎందుకలా?

ఎలుకలు అరటిపండ్లను అసహ్యించుకుంటాయి. అయితే అన్ని ఎలుకలు ఈ కోవలోకి రావట. కారణం తెలిస్తే షాక్ అవుతారు. ఎలుకల గురించి విస్మయపరిచే అధ్యయనం ఒకటి వెలువడింది. మగ ఎలుకలు అరటిపండ్ల వాసనను ఇష్టపడవు. అవి అరటిపండ్లను అసహ్యించుకుంటాయి. అయితే ఆడ ఎలుకలు అరటి పండ్లను అమితంగా ఇష్టపడతాయట. క్యూబెక్‌లోని మాంట్రియల్‌లోని మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అసాధారణ విషయాన్ని కనుగొన్నారు. 


అధ్యయనం సమయంలో మగ ఎలుకలలో ఒత్తిడి హార్మోన్ల పెరుగుదలను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. మగ ఎలుకలు గర్భిణీ లేదా పాలిచ్చే ఆడ ఎలుకలకు దూరంగా ఉంటాయి. ఎందుకంటే గర్భిణీ ఎలుకల మూత్రంలో ఉండే ఎన్-పెంటైల్ అసిటేట్ వల్ల మగ ఎలుకలు సమస్యలకు గురవుతాయి. గర్భిణీ లేదా పాలిచ్చే ఎలుక మూత్రం వాసన మగ ఎలుకలలో ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో అవి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. 'సైన్స్ అడ్వాన్స్' మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం గర్భిణీ లేదా పాలిచ్చే ఎలుకల మూత్రం వాసన అరటిపండు వాసనను పోలివుంటుంది. అందుకే మగ ఎలుకలు అరటిపండ్లను అసహ్యించుకుంటాయి. ఆడ ఎలుకల విషయంలో ఇలా జరగదని అధ్యయనంలో పేర్కొన్నారు.

Updated Date - 2022-05-31T14:17:49+05:30 IST