మాజీ ప్రధాని ఖాతా తొలగించిన ట్విట్టర్

ABN , First Publish Date - 2020-10-30T22:33:28+05:30 IST

మహతీర్‌‌ ట్వీట్లపై ట్విట్టర్ యాజమాన్యానికి ఫ్రాన్స్ డిజిటల్ సెక్టార్ సెక్రెటరీ కెడ్రిక్‌ఓ ఫిర్యదు చేశారు. మలేషియా మాజీ ప్రధానమంత్రి ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయాలని ఆ ఫిర్యాదులో కెడ్రిక్ పేర్కొన్నారు. ఒక వేళ ఆ ఖాతాపై ట్విట్టర్ చర్యలు తీసుకోకపోతే హత్యను, విధ్వంసాన్ని సమర్ధించినట్టేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు

మాజీ ప్రధాని ఖాతా తొలగించిన ట్విట్టర్

కౌలాలంపూర్: మలేషియా మాజీ ప్రధానమంత్రి మహతీర్ మొహమద్ ఖాతాను ట్విట్టర్ తొలగించింది. ట్విట్టర్ నిబంధనలకు విరుద్ధంగా ఆయన ట్వీట్లు ఉన్న కారణంగా ఆయన ఖాతా తొలగించినట్లు ట్విట్టర్ తెలిపింది. ఫ్రాన్స్‌లో జరిగిన నేరాన్ని సమర్ధించే విధంగా మహతీర్ ట్వీట్లు ఉన్నట్లు ట్విట్టర్ యాజమాన్యం పేర్కొంది. మహతీర్ ట్వీట్లు నెట్టింట్లో పెద్ద దుమారానికి కారణమయ్యాయి, ఆయనపై ట్విట్టర్‌కు చాలా మంది ఫిర్యాదు చేశారు. దీంతో ఖాతా తొలగించిక తప్పలేదట.


మహతీర్‌‌ ట్వీట్లపై ట్విట్టర్ యాజమాన్యానికి ఫ్రాన్స్ డిజిటల్ సెక్టార్ సెక్రెటరీ కెడ్రిక్‌ఓ ఫిర్యదు చేశారు. మలేషియా మాజీ ప్రధానమంత్రి ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయాలని ఆ ఫిర్యాదులో కెడ్రిక్ పేర్కొన్నారు. ఒక వేళ ఆ ఖాతాపై ట్విట్టర్ చర్యలు తీసుకోకపోతే హత్యను, విధ్వంసాన్ని సమర్ధించినట్టేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్విట్టర్ ఫ్రాన్స్ మేనేజింగ్ డైరెక్టర్‌తో మాట్లాడాను. మలేషియా మాజీ ప్రధానమంత్రి ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయాలని గట్టిగానే చెప్పాను. ఒక వేళ అలా చేయకపోతే ఫ్రాన్స్‌లో జరిగిన దారుణానికి ట్విట్టర్ అధికారిక పిలుపును ఇవ్వడంగా భావించాల్సి ఉంటుందని చెప్పాను’’ అని కెడ్రిక్ అన్నారు.


మహతీర్ చేసిన 13 ట్వీట్లలో ఫ్రాన్స్ ఉదంతాన్ని సమర్ధించే విధంగా ఉన్నాయని ట్విట్టర్ పేర్కొంది. ఒక ట్వీట్‌లో ‘‘మహమ్మద్ ప్రవక్తపై వ్యంగ్య కార్టూన్లను పిల్లలకు చూపించిన టీచర్ తల నరకడాన్ని నేను సమర్థించను. అయితే, ఇతరులను కించపరచడం భావ ప్రకటనా స్వేచ్ఛ పరిధిలోకి రాదు’’ అని రాసుకొచ్చారు. మరో ట్వీట్‌లో ‘‘స్కూల్ టీచర్‌ హత్య జరిగితే ఇస్లాంను ముస్లింలను నిందిస్తున్నారు. అయినా ఇది పాత అలవాటే కదా’’ అని ట్వీట్ చేశారు. ‘‘ఫ్రెంచ్ చరిత్రలో ఎంతో మందిని చంపిన దాఖలాలున్నాయి... హత్యకు గురైనవారిలో అత్యధికులు ముస్లింలే. కాబట్టి ఫ్రాన్స్‌లో లక్షలాది మందిని చంపే హక్కు ముస్లింలకు ఉంది’’ అని ట్వీట్ చేశారు. ఇవన్నీ హింసను ప్రేరేపించే విధంగా ఉన్నట్లు భావించి.. మహతీర్ ఖాతాను తొలగించినట్లు ట్వీట్టర్ పేర్కొంది.

Updated Date - 2020-10-30T22:33:28+05:30 IST