Abn logo
Sep 21 2021 @ 01:59AM

గరుడుడిపై మలయప్ప విహారం

 తిరుమల, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో సోమవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. పెరటాశి మాసం కావడంతో భక్తుల రద్దీ నడుమ వాహనసేవ నిర్వహించారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తి మలయప్పస్వామిని ప్రత్యేక అలంకరణతో గరుడవాహనంపై కొలువుదీర్చారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు మలయప్పస్వామి తిరుమాడవీధుల్లో విహరిస్తూ భక్తుల దర్శనమిచ్చారు. పెరటాశి మాసం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో ఆలయం ముందు, గ్యాలరీల్లోకి చేరుకుని వాహనసేవను తిలకించారు. మంగళవాయిద్యాలు, కర్పూర నీరాజనాల నడుమ గరుడవాహనసేవ వేడుకగా సాగింది. వాహనసేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉమాదేవి పాల్గొని ఉత్సవమూర్తిని దర్శించుకున్నారు.