Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 19 May 2022 08:50:44 IST

Malavika Mohanan: విజయ్ దేవరకొండతో ఆ కోరిక తీరేనా..?

twitter-iconwatsapp-iconfb-icon

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) నటించిన 'పేట్టా' (Petta), తళపతి విజయ్ (Talapathy Vijay) హీరోగా నటించిన 'మాస్టర్' (Master) వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan). ఈ బ్యూటీకి టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సరసన ఓ రొమాంటిక్ మూవీలో నటించాలని ఉందంటూ తాజాగా తన మనసులోని కోరికను బయటపెట్టింది. ప్రముఖ సినీమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ (K U Mohanan) కూతురిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మాళవికకు క్రేజీ ఆఫర్లు వస్తున్నా కూడా స్టార్ హీరోయిన్‌గా మాత్రం పాపులారిటీ దక్కించుకోలేకపోతోంది. 

ఇక ఇటీవల ధనుష్ సరసన 'మారన్' అనే సినిమా చేసింది మాళవిక. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావడంతో తనకు ఆశించిన పేరు రాలేదు. ప్రస్తుతం హిందీలో 'యుధ్ర' పేరుతో రూపొందుతున్న సినిమాలో నటిస్తోంది. అలాగే, ఎప్పటినుంచో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వాస్తవంగా అయితే, ఎప్పుడో అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ జరగాల్సింది. విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేశారు కూడా. ఆనంద్ అన్నామలై దర్శకుడిగా పరిచయం అవుతూ మొదలైన సినిమా ఆరంభంలోనే ఆగిపోయింది.

అంతే, మళ్ళీ ఇప్పటి వరకు మరో తెలుగు సినిమాలో అవకాశం అందుకోలేకపోయింది. అయితే, తాజాగా మాళవిక మోహనన్ 'ఆస్క్ మాళవిక' అనే హ్యాష్ ట్యాగ్‌తో కాసేపు అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. దీనిలో భాగంగా ఓ నెటిజన్.. 'తమిళ బిగ్ స్టార్స్ అయిన రజనీకాంత్, విజయ్‌లతో కలిసి నటించారు. ఇప్పడు ఎవరితో కలిసి నటించాలని ఎదురుచూస్తున్నారు?..అని అడిగాడు. దీనికి మాళవిక..'విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్ లేదా రోమ్ కోమ్ సినిమా చేయాలని వుంది'..అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది. మరి నిజంగా తన కోరిక తీరుతుందా లేదా చూడాలి. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement