Aug 4 2021 @ 14:10PM

గ్లామర్‌ డోస్ పెంచుతున్న మాళవిక

కోలీవుడ్‌లో హీరోయిన్‌ మాళవికా మోహనన్‌ కాస్త గ్లామర్‌ డోస్‌ పెంచుతున్నారు. కార్తీక్‌ సుబ్బురాజ్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'పేట చిత్రంలో శశికుమార్‌కు జోడీగా నటించారు. దీని తర్వాత ఇళయదళపతి విజయ్‌ నటించిన 'మాస్టర్‌'లో నటించారు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ గా నిలిచింది. ఈ చిత్రంతో మాళవికా మోహనన్‌ స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ధనుష్‌ - కార్తీక్‌ నరేన్‌ కాంబోలో తెరకెక్కుతున్న 'మారన్‌' చిత్రం లో నటిస్తున్నారు. అలాగే, మరికొన్ని ప్రాజెక్టుల్లో నటించేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే, సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఈ మలయాళ భామ... అపుడపుడూ గ్లామర్‌ డోస్‌తో ప్రత్యేక ఫొటో షూట్‌ చేసి, వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. తాజాగా ఆమె నడుముకు గొలుసు ధరించి అందాలు ఆరబోస్తూ తీసిన ఫొటోలను షేర్‌ చేయగా అవి వైరల్‌ అయ్యా యి. వాటికి నెటిజన్స్‌ రక రకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.