Jun 17 2021 @ 09:44AM

'కేజీయఫ్ 2' కి డబ్బింగ్ మొదలుపెట్టిన నటి..

మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'కేజీయఫ్ 2' కి డబ్బింగ్ స్టార్ట్ చేశారు మాళవిక అవినాష్. ఇందులో ఆమె కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ - శ్రీనిధి శెట్టి జంటగా నటించిన భారీ యాక్షన్ మూవీ 'కేజీయఫ్ చాప్టర్ 2'. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 'కేజీయఫ్ చాప్టర్ 1' కి సీక్వెల్‌గా రాబోతున్న ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. లాక్ డౌన్ కారణంగా పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ కూడా ఆగిపోయింది. అయితే తాజాగా పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ మొదలవగా, అందులో భాగంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టినట్టు నటి మాళవిక అవినాష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అప్‌డేట్ ఇచ్చారు. 'కేజీయఫ్ 1' లో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు సీక్వెల్ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని హోంబలే పిక్చర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.