Jun 1 2021 @ 17:45PM

ఆశ మనల్ని ముందుకు నడిపిస్తుంది: మలైకా


వైరస్‌ సోకడం తేలికైన విషయం కాదు..

శారీరకంగా, మానసికంగా బలపడ్డాను

సంకల్ప బలం గొప్పది

–  మలైకా అరోరా


బాలీవుడ్‌ ఐటెమ్‌ సాంగ్స్‌ స్పెషలిస్ట్‌ మలైకా అరోరా 48 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ప్రతి రోజు వ్యాయామాలతో బిజీగా గడుపుతున్నారు. గత సంవత్సరం సెప్టెంబరులో కరోనా సోకి రెండు వారాలకుఉ కోలుకున్నారు. అనంతరం ఆ సమయంలో పడిన ఇబ్బందులు, వ్యాయామాలు ఆమెకు ఎలా ఉపయోగపడ్డాయి, మళ్లీ మామూలు ఎలా అయ్యారు అన్న విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘అందరూ ఎప్పుడూ నన్ను అదృష్టవంతురాలిని అంటుంటారు. అది నిజమే! నా జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలకు అలాగే భావిస్తాను. కానీ అన్ని విషయాల్లోనూ మనకు లక్‌ ఉండదు. గతేడాది సెప్టెంబరు 5న నాకు కొవిడ్‌ సోకింది. ఎవరైనా కొవిడ్‌ నుంచి కోలుకోవడం ఈజీ అని చెప్పినటైతే, వారికి కచ్చితంగా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కావలసినంత ఇమ్యూనిటీ ఉండాలి,  లేదా వారికి కొవిడ్‌తో పోరాటం గురించి అవగాహన లేకపోయి అయినా ఉండాలి.  నా విషయంలో వైరస్‌ సోకడం తేలికైన విషయం కాదు. శారీరకంగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంట్లో రెండడుగులు వేయడానికి కూడా ఇబ్బంది పడ్డా. చాలా భారంగా అనిపించింది.  కేవలం కూర్చొని ఉండటం, మంచం నుంచి కిందకి దిగి అడుగులు వేయడం, కిటికీ వద్ద నిలబడటం.. లాంటివే చేయగలిగేదాన్ని. చాలా నీరసంగా ఉండేది. శక్తి సామర్థ్యాన్ని కోల్పోయా. వైరస్‌ సోకి 10 నెలలు గడిచినా నా శరీరంలో నీరసమనేది అలాగే ఉంది. మొదట్లో నా మనసులోని ఆలోచనలకు నా శరీరం సహకరించేది కాదు. శారీరకంగా మళ్లీ మామూలు మనిషిని కాలేనేమో, మునుపటిలా పని చేయగలనా అనిపించేంది. వర్కవుట్స్‌ మొదలుపెట్టిన మొదటి రోజు  ఏదీ చేయలేకపోయా. మానసికంగా కాస్త ఇబ్బంది పడ్డా. కానీ రెండోరోజు కచ్చితంగా వ్యాయామం చేయాలని బలంగా అనుకున్నా. అదే సంకల్పంతో మూడు, నాలుగు రోజులు అలాగే కొనసాగించా. మళ్లీ ఆరోగ్యంగా ఉన్నాననే  భావన నా కలిగింది. కరోనా రావడానికి ముందు ఎలా వర్కవుట్స్‌ చేేసదాన్నో, ఇప్పుడు అలానే చేయగలుగుతున్నా. శారీరకంగా, మానసికంగానూ బలంగా  తయారయ్యా. ఎటువంటి స్థితిలో అయినా ఆశ మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. జీవితంలో దానిని కోల్పోకూడదు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించారు.