Malaika Aroraకి రొమాంటిక్ సర్‌ప్రైజ్ ఇచ్చిన అర్జున్ కపూర్.. నీటిలో సైక్లింగ్

బాలీవుడ్ లవ్‌బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా మాల్డీవులకి ట్రిప్‌కి వెళ్లి తిరిగి వచ్చారు. తాజాగా ఫ్యాన్స్ కోసం అక్కడ ఈ స్టార్ కపుల్ గడిపిన మధుర క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.


అర్జున్ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన ఈ వీడియో ఎంతో మంది అభిమానుల గుండెలను కొల్లగొట్టింది. దీంతో ఈ యంగ్ హీరో తన ప్రేయసి మలైకాకి ఇచ్చిన రొమాంటిక్ సర్‌ప్రైజ్ వీడియో వైరల్‌గా మారింది. అందులో ఈ బ్యూటీ పసుపు కలర్ గౌన్‌లో ధరించగా.. బ్యాక్ గ్రౌండ్‌లో హర్డీ సందు మ్యూజిక్ హిట్ నెంబర్ ‘బిజ్లీ బిజ్లీ’ ప్లే అవుతూ ఉంటుంది. ఈ తార చెప్పు లేకుండా నడుచుకుంటూ వెళ్లి అక్కడ హార్ట్ సింబల్‌లో ఉన్న ఓ సెటప్ చూసి ఎంతో సంతోషపడింది.


అయితే ఈ వీడియోకి ముందు మరో వీడియోని పోస్ట్ చేశాడు అర్జున్. అందులో మలైకాతో కలిసి నీటిలో సైక్లింగ్ చేశాడు. దీనికి ‘గర్ల్‌ఫ్రెండ్ ఓ ట్రైనర్ కన్నా మంచి టాస్క్ మాస్టర్ అయితే ఇలా ఉంటుంది. హాలీడేలో కూడా కష్టపడుతున్నా’  అంటూ రాసుకొచ్చాడు.


Advertisement

Bollywoodమరిన్ని...