Abn logo
Oct 18 2020 @ 03:30AM

చిన్నశేష, హంస వాహనాలపై మలయప్ప

తిరుమల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజైన శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరుడు...దామోదర కృష్ణుడి అవతారంలో చిన్నశేషవాహనంపై దర్శనమిచ్చారు. శ్రీవారి సన్నిధి నుంచి విమానప్రదక్షిణగా స్వామివారు కల్యాణమండపానికి వేంచేసి, అక్కడ కొలువుతీర్చిన ఐదుతలల చినశేషవాహనంపై నెమలి పింఛం, గదతో కటాక్షించారు. రాత్రి 7 గంటలకు విశేష అలంకరణతో హంసవాహనంపై గోవిందుడు కొలువయ్యారు. 

Advertisement
Advertisement
Advertisement