Pushpa the rise : ఆకట్టుకుంటోన్న మేకింగ్ వీడియో

అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రూపొందుతోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప ది రైజ్’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 17న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. ఇది వరకు విడుదలైన టీజర్, సింగిల్స్.. సినిమాపై భారీ అంచనాల్ని నెలకొల్పాయి. కాగా  రేపు (సోమవారం) ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. దానికి ముందు ‘పుష్ప’ టీమ్ ఓ చిన్న మేకింగ్ వీడియోను విడుదల చేశారు. 


మనం ఈ లొకేషన్ ను ఖాళీ చేసి వెళ్ళేలోపు.. ఇక్కడున్న ప్లాస్టిక్ సామాను, చెత్త చెదారం అంతా క్లీన్ చేసి నీట్ గా ఉంచాలని మేకింగ్ వీడియోలో బన్నీ ‘పుష్ప’ టీమ్ కు సూచించడం కనిపిస్తుంది. అలాగే.. ఈ సినిమాను షూట్ చేసిన వివిధ లొకేషన్స్ లో టీమ్ పడిన కష్టాన్ని వీడియోలో కళ్ళకు కట్టారు. సెల్ ఫోన్ తో చిత్రీకరించిన ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


Advertisement