విరిగిన పాలతో...
ABN , First Publish Date - 2020-07-06T05:30:00+05:30 IST
పాలు ఒక్కోసారి విరిగిపోతుంటాయి. వాటితో పనీర్ చేసుకుంటాం. మిగిలిన నీళ్లను పారబోస్తుంటాం. అలాకాకుండా ఆ నీళ్లను ఇలా కూడా ఉపయోగించవచ్చు. అదెలాగో చూద్దాం...
పాలు ఒక్కోసారి విరిగిపోతుంటాయి. వాటితో పనీర్ చేసుకుంటాం. మిగిలిన నీళ్లను పారబోస్తుంటాం. అలాకాకుండా ఆ నీళ్లను ఇలా కూడా ఉపయోగించవచ్చు. అదెలాగో చూద్దాం...
- సాధారణంగా చపాతీ పిండిలో నీళ్లు కలుపుతాం. ఈసారి విరిగిన పాల నుంచి తీసిన నీటిని కలిపితే చపాతీలు చక్కగా వస్తాయి. రుచిగానూ ఉంటాయి.
- కూరగాయలు వండేటప్పుడు సూప్ కోసం విరిగిన పాలలోని నీళ్లను వాడవచ్చు. ఈ నీళ్లతో కూర చేస్తే కూర రుచిగా ఉంటుంది. అలానే పప్పుదినుసులు వండినప్పుడు ఈ నీళ్లు పోస్తే కూర టేస్టీగా వస్తుంది.
- విరిగిన పాలలోని నీటిలో కొద్దిగా వెచ్చని నీళ్లు కలపాలి. ఆ నీటిని అన్నం వండేందుకు ఉపయోగిస్తే అన్నంలో పోషకాలు, ప్రొటీన్లు చేరతాయి. అన్నం రుచీ పెరుగుతుంది. అంతేకాదు విరిగిన పాల నీటిని వాడితే నూడిల్స్ టేస్టీగా వస్తాయి.