టీచర్ల బదిలీ షెడ్యూల్‌కు సవరణలు తప్పనిసరి

ABN , First Publish Date - 2020-11-25T05:10:05+05:30 IST

ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ల మేరకు టీచర్ల సాధారణ బదిలీ షెడ్యూల్‌ను సవరించను న్నారు.

టీచర్ల బదిలీ షెడ్యూల్‌కు సవరణలు తప్పనిసరి


ఏలూరు ఎడ్యుకేషన్‌, నవంబరు 24 : ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ల మేరకు టీచర్ల సాధారణ బదిలీ షెడ్యూల్‌ను సవరించను న్నారు. విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడంతో రెండు నుంచి ఐదు రోజులపాటు షెడ్యూల్‌ పొడిగించే అవకాశా లున్నాయి. దీనివల్ల గ్రేడ్‌ – 2 హెచ్‌ఎంల బదిలీకి గరిష్ట సర్వీసును ఐదేళ్ల స్టేషన్‌ సర్వీసుగా తీసుకోనుం డడంతో తప్పనిసరి బదిలీ జాబితా నుంచి సుమారు 25 మంది ప్రధానోపాధ్యాయులకు బదిలీ నుంచి ఉపశమనం కలగనుంది. మిగతా టీచర్లకు సంబంధించి 55 ఎన్‌టైటిల్‌మెంట్‌ పాయింట్ల పరిమి తిని, టోటల్‌ పాయింట్స్‌ 85 పరిమి తిని తొలగించారు. ఇక సర్వీసు సీనియార్టీ పాయింట్లను 15 నుంచి 16.5కు పెంచడం వల్ల జూనియర్లతో సమానంగా ఉన్న సీనియర్‌ టీచర్లు ఒక్కసారిగా బదిలీల్లో ముందుకు వచ్చే ప్రయో జనం లభించనుంది.  మంగళవారం జరగాల్సిన సీనియార్టీ జాబి తాల విడుదల ప్రక్రియను నిలిపివేయడంతో సవరించిన బదిలీ షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉంది.

Updated Date - 2020-11-25T05:10:05+05:30 IST