కృత్రిమ ఇసుక తయారు చేస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-01-19T04:55:58+05:30 IST

కృత్రిమ ఇసుక తయారు చేస్తే చర్యలు

కృత్రిమ ఇసుక తయారు చేస్తే చర్యలు
సీజ్‌ చేసిన ఇసుక ఫిల్టర్‌

దోమ: ఇసుక తయారు చేస్తే చట్టపర చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ వహిదాఖాతూన్‌ అన్నారు. గొట్లచెల్క తండాలో మంగళవారం ఒక ఇసుక హౌజ్‌, మోటారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో ఎవరైనా ఇసుక ఫిల్టర్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. తండాకుచెందిన దామ్లానాయక్‌ ఇసుక ఫిల్టర్‌ నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఫిల్టర్‌ ఇసుక తయారు చేస్తున్న వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొ న్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ లింగం, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T04:55:58+05:30 IST