‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. వైసీపీకి 15 కంటే ఎక్కువ సీట్లు రావు..’

ABN , First Publish Date - 2020-08-05T14:12:41+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన సవాల్‌ను వైసీపీ ఎందుకు స్వీకరించడం లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత మాకినేని పెదరత్తయ్య ప్రశ్నించారు

‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. వైసీపీకి 15 కంటే ఎక్కువ సీట్లు రావు..’

చంద్రబాబు చేసిన సవాల్‌ను ఎందుకు స్వీకరించడం లేదు..?:  మాకినేని పెదరత్తయ్య


గుంటూరు (ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన సవాల్‌ను వైసీపీ ఎందుకు స్వీకరించడం లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత మాకినేని పెదరత్తయ్య ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఆంధ్రజ్యోతితో ఫోన్‌లో మాట్లాడారు. విధ్వంస విధానాన్ని అమలు చేస్తున్న వైసీపీకి ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం లేదన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికల జరిపితే వైసీపీకి 15కంటే ఎక్కువ సీట్లు రావని జోస్యం చేప్పారు. అమరావతి ఎక్కడికి పోదన్న వైసీపీ నేతలు గుండెపై చేతులు వేసుకుని ఆలోచించండన్నారు. కళ్లుండి కబోదులా మాట్లాడటం కాదని.... రాష్ట్రాంలో హోంమంత్రి స్థాయిలో ఉండి ఇంకా ప్రజలను మభ్యపెట్టటం సరికాదని సూచరితకు హితవు పలికారు. అమరావతిలో భవనాలిన్ని గ్రాఫిక్స్‌ అంటున్న నేతలు అక్కడి వెళ్లి నిర్మాణాలు చూసి అదే మాట అనాలని సవాలు విసిరారు.  జగన్‌ మెప్పు కోసం ప్రజల నమ్మకాన్ని తాకట్టు పెట్టవద్దని జిల్లా వైసీపీ నేతలుకు హితవు పలికారు. ఇప్పటికైనా పాలకులు తీరు మార్చుకోవాలని పెద రత్తయ్య సూచించారు. 

Updated Date - 2020-08-05T14:12:41+05:30 IST