మేకప్‌ మిస్టేక్స్‌

ABN , First Publish Date - 2022-06-18T09:00:44+05:30 IST

మేకప్‌ వేసుకునే క్రమంలో ఏ చిన్న తప్పు దొర్లినా మేకప్‌ ఫలితం దక్కకుండా పోతుంది.

మేకప్‌ మిస్టేక్స్‌

మేకప్‌ వేసుకునే క్రమంలో ఏ చిన్న తప్పు దొర్లినా మేకప్‌ ఫలితం దక్కకుండా పోతుంది. కాబట్టి ఫౌండేషన్‌ మొదలు, లిప్‌స్టిక్‌ వరకూ మేకప్‌ స్టెప్స్‌ అన్నీ క్రమ పద్ధతిలో అనుసరించాలి. 


ఫౌండేషన్‌

ఇలా: ఫౌండేషన్‌ వేసుకునే ముందు మాయిశ్చరైజర్‌ పూసుకుని, ప్రైమర్‌ అప్లై చేసుకోవాలి. వేసుకునే ఫౌండేషన్‌ చర్మ రంగుకు దగ్గరగా ఉండేలా చూసుకోవాలి.

ఇలా కాదు: ఫౌండేషన్‌ను చర్మానికి నేరుగా అప్లై చేసుకోకూడదు. మెడ రంగుకు మ్యాచ్‌ కాని ఫౌండేషన్‌ను ఎంచుకోకూడదు.


కన్‌సీలర్‌

ఇలా: ఫౌండేషన్‌ కంటే ఒకటి లేదా రెండు షేడ్స్‌ తక్కువ రంగుతో కూడిన కన్‌సీలర్‌ను ఎంచుకోవాలి.

ఇలా కాదు: మొదట కరెక్టర్‌ ఉపయోగించకుండా, కళ్ల దిగువన వలయాల మీద నేరుగా కన్‌సీలర్‌ను ఉపయోగించకూడదు.


పౌడర్‌

ఇలా: ఫౌండేషన్‌ తర్వాత పౌడర్‌ వాడాలి.

ఇలా కాదు: మేకప్‌ పూర్తయిన తర్వాత పౌడర్‌ వాడకూడదు.


కాంటూర్‌

ఇలా: మ్యాటి బ్రాంజర్‌ కాంటూర్‌ వాడుకోవాలి.

ఇలా కాదు: వార్మ్‌డ్‌ టోన్‌తో కూడిన బ్రాంజర్‌ను వాడుకోకూడదు.


హైలైట్‌

ఇలా: బుగ్గలు, ముక్కు, పై పెదవి అంచు (క్యూపిడ్స్‌ బౌ)లను హైలైట్‌ చేసుకోవాలి.

ఇలా కాదు: ఆకారంలో పెద్దగా ఉండే యాపిల్‌ చీక్స్‌, పెద్ద చర్మ రంధ్రాలు ఉంటే హైలైటర్‌ ఉపయోగించకూడదు.


బ్లష్‌

ఇలా: బుగ్గల మీద అప్లై చేసి, పై వైపుకు బ్లెండ్‌ చేయాలి.

ఇలా కాదు: బుగ్గల అడుగున బ్లష్‌ అప్లై చేయకూడదు.


కనుబొమలు

ఇలా: వెంట్రుకల రంగు కంటే రెండింతలు నల్లగా ఉండే ఐబ్రో పెన్సిల్‌ ఎంచుకోవాలి. బ్రూనెట్స్‌ అయితే రెండింతలు లేత రంగులో ఉండే దాన్నే ఎంచుకోవాలి.

ఇలా కాదు: పూర్తిగా నలుపు రంగు బ్రో ప్రొడక్ట్స్‌ను ఉపయోగించకూడదు.


కళ్లు

ఇలా: కనురెప్పల మీద ప్రైమర్‌ అప్లై చేసి, వార్మ్‌ టోన్‌ కలిగిన ఐ షాడో వాడుకోవాలి.

ఇలా కాదు: నేరుగా ఐ షాడో అప్లై చేయకూడదు. కనురెప్పల ముడతల మీద షిమ్మర్‌ అప్లై చేయకూడదు.


ఐ లైనర్‌

ఇలా: సహజసిద్ధమైన లుక్‌ కోసం పెన్సిల్‌ లేదా జెల్‌ ఐలైనర్‌ ఉపయోగించాలి. 

ఇలా కాదు: లిక్విడ్‌ ఐలైనర్‌ వాడుకోకూడదు. 


ఐ ల్యాషెస్‌

ఇలా: మస్కారా వేయడానికి ముందే ఐల్యాష్‌ కర్లర్‌ను ఉపయోగించాలి. ఫాల్స్‌ ఐల్యాషెస్‌ను పల్చని బ్యాండ్‌తో అంటించుకోవాలి. 

ఇలా కాదు: మస్కారా వేసుకున్న తర్వాత కర్లర్‌ను ఉపయోగించకూడదు. అలాగే ఫాల్స్‌ ఐల్యాషెస్‌ మందపాటి బ్యాండ్‌తో అంటించుకోకూడదు.


లిప్‌ లైనర్‌

ఇలా: చిన్న స్ట్రోక్స్‌తో పెదవుల అంచుల వెంట లైన్‌ గీసుకోవాలి.

ఇలా కాదు: లిప్‌ లైనర్‌ను ఒకేసారి డ్రాగ్‌ చేస్తూ, పెదవి అంచులో గీత గీసుకోకూడదు. 

Updated Date - 2022-06-18T09:00:44+05:30 IST