మేకప్‌ లుక్‌ కోసం...

ABN , First Publish Date - 2020-10-10T05:34:14+05:30 IST

ముఖం తాజాగా కనిపించేందుకు మేకప్‌ తప్పనిసరి. అయితే ముఖం కాంతిమంతంగా మారాలంటే మేకప్‌ ఒక్కటే కాదు శరీర శుభ్రత పాటించడం కూడా

మేకప్‌ లుక్‌ కోసం...

ముఖం తాజాగా కనిపించేందుకు మేకప్‌ తప్పనిసరి. అయితే ముఖం కాంతిమంతంగా మారాలంటే మేకప్‌ ఒక్కటే కాదు శరీర శుభ్రత పాటించడం కూడా చాలా ముఖ్యం. మేకప్‌ వేసుకోకున్నా కూడా మేకప్‌ లుక్‌ వచ్చేందుకు ఏం చేయాలంటే...


  1. నీళ్లు ఎక్కువగా తాగాలి. దాంతో ఒంట్లోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
  2. రోజూ ఉదయాన్నే నిమ్మరసం కలిపిన వేడినీళ్లు తాగాలి. నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని లోపల నుంచి శుభ్రం చేస్తుంది. చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది.
  3. మృతకణాలను తొలగించడం వల్ల ముఖం మీది చర్మం తాజాగా మారుతుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు ఎక్స్‌ఫోలియేట్‌ తప్పనిసరిగా చేసుకోవాలి. 
  4. టోనర్‌ వాడడం వల్ల చర్మం నిగారింపును పొందుతుంది. ముఖ్యంగా రోజ్‌వాటర్‌ ఉన్న టోనర్‌ ఉపయోగిస్తే చర్మం పీహెచ్‌ బ్యాలెన్స్‌ అవుతుంది. తాజాదనం సొంతమవుతుంది. 
  5. ఎండలో బయటకు వెళ్లే ముందుసన్‌స్ర్కీన్‌ రాసుకోవడం మరచిపోవద్దు. అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడడమే కాకుండా మేకప్‌ వేసుకోకున్నా కూడా ముఖాన్ని మెరిసిపోయేలా చేస్తుంది.

Updated Date - 2020-10-10T05:34:14+05:30 IST