ఇది డెత్ మెషీన్... అనాయాస మరణానికి చట్టబద్ధ మార్గం.. వివరాలివే..

ABN , First Publish Date - 2022-02-06T13:44:55+05:30 IST

అనాయాస మరణం(కారుణ్య మరణం) విషయంలో..

ఇది డెత్ మెషీన్... అనాయాస మరణానికి చట్టబద్ధ మార్గం.. వివరాలివే..

అనాయాస మరణం(కారుణ్య మరణం) విషయంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇక్కడ సూసైడ్ పాడ్ అంటే అనాయాస యంత్రానికి చట్టపరమైన ఆమోదం లభించింది. ఈ ఆమోదం తర్వాత అనాయాస మరణాలకు లైన్ క్లియర్ అయ్యింది. తీవ్ర అస్వస్థతకు గురై బతుకుపై ఆశ లేని బాధితులు ఈ యంత్రం ద్వారా మృత్యువును కౌగిలించుకోగలుగుతారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజలు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నిర్ణయం ఆత్మహత్యకు దారితీస్తుందని అంటున్నారు. అలాగే ఈ సూసైడ్ పాడ్‌ను అభివృద్ధి చేసిన ఆస్ట్రేలియాకు ఎగ్జిట్ ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ ఫిలిప్ నిట్ష్కేను డాక్టర్ డెత్ అని పిలుస్తున్నారు. అనాయాస మరణం ఎప్పుడు అవసరమవుతుంది? ఈ యంత్రం మనుషులను ఎలా చంపుతుంది? లాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. 




అనాయాస మరణం అంటే అంటే తన మరణాన్ని తానే స్వీకరించడం. జీవితం మరణం కంటే బాధాకరంగా మారినప్పుడు ఇది అవసరం. ఇది రెండు రకాలు, మొదటి క్రియాశీల అనాయాస మరణం.  రెండవది నిష్క్రియ అనాయాస మరణం. యాక్టివ్ యుథనేషియా విధానంలో రోగి జీవితం వైద్యుల సహాయంతో ముగుస్తుంది. అదే సమయంలో నిష్క్రియ అనాయాస మరణ విధానంలో.. బంధువుల అనుమతితో వైద్యులు.. కోమా లేదా క్లిష్టమైన స్థితిలో ఉన్న రోగిని రక్షించడానికి ఉపకరించే పరికరాలను క్రమంగా ఆపివేస్తారు. ఫలితంగా బాధితుడు మరణిస్తాడు. ఎగ్జిట్ ఇంటర్నేషనల్ ఈ యంత్రాన్ని తయారుచేసింది. సూసైడ్ పాడ్ రెండు నమూనాలతో సిద్ధం అయ్యింది. దీనికి సార్కో అని పేరు పెట్టారు. ఇందులో రోగిని పడుకోబెడతారు. దీని తర్వాత ఒక బటన్ ప్రెస్ చేస్తారు. ఇలా చేసిన తర్వాత, యంత్రం లోపల నత్రజని స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది 20 సెకన్లలో ఆక్సిజన్ స్థాయి 21 శాతం నుండి ఒక శాతానికి పడిపోతుంది. ఫలితంగా రోగి 5 నుండి 10 నిమిషాల్లో మరణిస్తాడు. సూసైడ్ పాడ్‌ను రూపొందించిన సంస్థ ఎగ్జిట్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఫిలిప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ కొత్త యంత్రంతో అనాయాస మరణాన్ని కోరుకునే భాధితుడు భయాందోళనకు గురికాడు. ఇప్పటివరకు అనుసరించిన అనాయాస మరణ పద్ధతి భిన్నంగా ఉండేది. స్విట్జర్లాండ్‌లో 1300 మందికి అనాయాస మరణం పొందే అవకాశాన్ని కల్పించారు. ఇప్పటి వరకు అనాయాస మరణాన్ని కోరుకునే రోగులకు ద్రవ సోడియం పెంటోబార్బిటల్ ఇంజెక్షన్లు ఇచ్చేవారు. ఇంజెక్షన్ ఇచ్చిన 2 నుండి 5 నిమిషాల తర్వాత బాధితుడు గాఢ నిద్రలోకి వెళ్లి.. అనంతరం కోమాలోకి జారుకుని చనిపోయేవారు. సూసైడ్ క్యాప్సూల్ సహాయంతో రోగికి మరింత తేలికైన మరణాన్ని అందించవచ్చని కంపెనీ చెబుతోంది.

Updated Date - 2022-02-06T13:44:55+05:30 IST