Abn logo
Aug 3 2021 @ 22:36PM

ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయండి

ఆసిఫాబాద్‌లో మాట్లాడుతున్న ఆదివాసీ సంఘాల నాయకులు

- జిల్లా సర్‌మేడి కోవ దేవ్‌రావు
ఆసిఫాబాద్‌, ఆగస్టు 3:  జిల్లాలో ఈ నెల 9న జరిగే ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా సర్‌మేడి కోవ దేవ్‌రావు అన్నారు. మంళవారం జిల్లా కేంద్రంలోని రాజ్‌గోండ్‌ సేవా సమితి గోండ్వానా పంచాయతీ రాయ్‌ సెంటర్‌ భవన్‌లో ఆదివాసీ తొమ్మిది తెగల సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆదివాసీ దినోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పెందూర్‌ సుధాకర్‌, కేశవరావు, రఘు, జ్ఞానేశ్వర్‌, భూమేశ్వర్‌, భీంమల్లార్షా, గంగారాం, దశరత్‌, ఆత్రం గంగారాం, ఆత్రం పెంటు, ఆత్రం సంతోష్‌, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కెరమెరి: ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు కోరారు. ఆదివాసీ దినోత్సవం సంద ర్భంగా మంగళవారం హట్టిబేస్‌ క్యాంపులో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాత్కాలిక ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్‌గా మడావి రఘునాథ్‌, కన్వీనర్‌గా పెందర్‌ దాంబిరావు, కో కన్వీనర్‌గా కుర్సింగె ధర్ము, సభ్యులుగా సోంజీ, రాము, తుకారాం, శంకర్‌, బాపురావు, భీంరావులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఆది వాసీ సంఘాల నాయకులు భరత్‌ భూషణ్‌, సర్‌మేడీలు బొజ్జిరావు, జంగు, కుసుంరావు, భీంరావు, ధర్ము, జాలీంషావ్‌, శంకర్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.