జెండా ర్యాలీని జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2022-08-12T05:10:48+05:30 IST

పట్టణంలో 75వ ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 13న పట్టణంలో జరిగే భారీ తిరంగా జెండా మహార్యాలీని జయప్రదం చేయాలని ఆర్డీవో కోదండరామిరెడ్డి, డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. గురువారం రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ సభాభవనంలో జరిగిన తిరంగా జెండా మహార్యాలీ నిర్వహణపై సమీక్షా సమావేశంలో వారు పాల్గొన్నారు.

జెండా ర్యాలీని జయప్రదం చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో కోదండరామిరెడ్డి

ఆర్డీవో, డీఎస్పీ, కమిషనర్‌ పిలుపు 

రాజంపేట, ఆగస్టు 11: పట్టణంలో 75వ ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 13న పట్టణంలో జరిగే భారీ తిరంగా జెండా మహార్యాలీని జయప్రదం చేయాలని ఆర్డీవో కోదండరామిరెడ్డి, డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. గురువారం రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ సభాభవనంలో జరిగిన తిరంగా జెండా మహార్యాలీ నిర్వహణపై సమీక్షా సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13న పట్టణంలో మూడు రంగుల జాతీయ జెండాల శోభతో పట్టణమంతా పులకించి పోవాలని, ఆ రోజు మహాపండుగ పర్వదినం కావాలని, పట్టణంలోని ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, వలంటీర్లు, ప్రతి పౌరుడు, అధికారులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. అన్నమాచార్య ఇంజనీరింగ్‌ కళాశాల ఆధ్వర్యంలో భారీ బెలూన్లు, ప్లెక్సీల ఏర్పాటు, బ్యానర్లు ఏర్పాటు, టపాసుల మోతలు ప్రదర్శించడం జరుగుతుందన్నారు. జూనియర్‌ కళాశాల నుంచి ఆర్‌అండ్‌బీ కార్యాలయం వరకు 100 మీటర్ల జెండాతో 10 వేల మందితో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. తెలుపురంగు దుస్తులతో డ్రస్‌కోడ్‌ పాటించాల్సిన బాధ్యత ఉద్యోగులు, విద్యార్థులపై ఉందన్నారు. అదే రోజు పట్టణమంతా రోడ్లను శుభ్రం చేసి ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొస్తామన్నారు. 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు పట్టణమంతా విద్యుత్‌ దీపాలంకరణ ఉంటుందన్నారు. జాతీయ నేతలు, స్వాతంత్య్ర సమరయోధులతో విద్యుత్‌ దీపాలంకరణ కటౌట్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న వారికి భోజన సౌకర్యం ఏర్పాటు చేశామని, ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌ శిరీష, రాజంపేట తహసీల్దారు సుబ్రహ్మణ్యంరెడ్డిలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T05:10:48+05:30 IST