Abn logo
Sep 25 2021 @ 00:35AM

భారత్‌ బంద్‌ను విజయవంతం చేయండి

దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న డి.ఆదినారాయణ

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, సెప్టెంబరు 24: ఈ నెల 27న జరిగే భారత్‌ బంద్‌లో ప్రతి కార్మికుడు వారి కుటుంబ సభ్యులతో పాల్గొని విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ పిలుపునిచ్చారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 225వ రోజు  కొనసాగాయి. శుక్రవారం ఈ దీక్షలలో ఈఎండీ, డబ్ల్యూఎండీ, ఈఎన్‌ఎండీ, యుటిలిటీస్‌ కార్మికులు  పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ  భారత్‌ బంద్‌తో ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు ఎన్‌.రామారావు మాట్లాడుతూ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు నీరుకొండ రామచంద్రరావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, వీరాస్వామి, సత్యనారాయణ, నాగార్జున, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.