మహానాడును విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2022-05-24T06:53:54+05:30 IST

తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరాధ్యదైవం, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈనెల 27, 28 తేదిలలో ఒంగోలులో జరుగనున్న మహానాడును విజయవంతం చేయాలని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు.

మహానాడును విజయవంతం చేయండి
సన్నాహక సభలో మాట్లాడుతున్న అశోక్‌రెడ్డి

సన్నాహక సభలో మాజీ ఎమ్మెల్యే ముత్తుముల

మార్కాపురంలో టీడీపీ పరిశీలకులు మోహనకృష్ణ పర్యటన

కంభం, మే 23 : తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరాధ్యదైవం, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈనెల 27, 28 తేదిలలో ఒంగోలులో జరుగనున్న మహానాడును విజయవంతం చేయాలని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తెలిపారు. కంభం పట్టణం శీలంవీధిలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మహానాడు సన్నాహక సమావేశంలో పాల్గొన్న కంభం, అర్థవీడు, బేస్తవారపేట మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎన్‌టిఆర్‌ను స్మరించుకుంటూ ప్రతి ఇంటా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని పెద్ద పండుగ వాతావరణంగా చేయడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ అని, అలాంటి మహానాడుకు నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈసంవత్సరం ఈ పండుగను మన ఒంగోలులో నిర్వహించడం మన అదృష్టమని తెలిపారు. నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నందమూరి తారక రామారావుకు అసలైన నివాళి అర్పిద్దామని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో కంభం మండల టీడీపీ అధ్యక్షులు తోట శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, పార్లమెంటు కార్యదర్శి కేతం శ్రీనివాసులు, రాష్ట్ర ఎస్సీసెల్‌ ప్రధాన కార్యదర్శి గోన చెన్నకేశవులు, జెబికెపురం ఎంపిటిసి టి.భూపాల్‌రెడ్డి, నియోజకవర్గ బిసి సెల్‌ అధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు, కంభం మండల బిసిసెల్‌ అద్యక్షులు రమణ, రైతు అధ్యక్షులు తోట శ్రీను, బేస్తవారపేట మండల ప్రధాన కార్యదర్శి నరసింహయాదవ్‌, పార్లమెంటు మైనారిటీ నాయకులు అనీస్‌అహమ్మద్‌, దాదా, నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శి గని వెంకటేశ్వర్లు, ముస్లింమైనారిటీ అధ్యక్షులు సయ్యద్‌ కమర్‌, ఎస్సీసెల్‌ అధ్యక్షులు సిరివెల్ల రవికుమార్‌, పట్టణ అధ్యక్షులు మాధవ, రాష్ట్ర కార్యదర్శి ఆవుల శ్రీనివాసరెడ్డి, దోమల రమణ, భూపాలుడు, అర్థవీడు మండల నాయకులు ఆంజనేయులు, నారాయణ, వెంకటేశ్వర్లు, రంగారెడ్డి, ఖాజీపురం సర్పంచ్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గన్నేపల్లి మాజీసర్పంచ్‌ మౌళాలి, అర్థవీడు మాజీఎంపిపి చేగిరెడ్డి చిన్నకాశిరెడ్డి, పాపినేనిపల్లి మాజీఎంపిటిసి పాపయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

మార్కాపురం జిల్లా ప్రాధాన్యతను

అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తా : మోహన కృష్ణ

మార్కాపురం : జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని ఐదు నియోజకవర్గాలను కలిపి మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు ప్రాధాన్యతను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మార్కాపురం నియోజకవర్గ పరిశీలకులు మన్నవ మోహనకృష్ణ అన్నారు. స్థానిక పాండురంగస్వామి దేవస్థానం సమావేశ మందిరంలో సోమవారం మహానాడు సన్నాహక సమావేశం నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మన్నవ మోహనకృష్ణ పశ్చిమ ప్రాంత అభివృద్ధికి వెలుగొండప్రాజెక్ట్‌ ఆవశ్యకతను పార్టీ పెద్దలకు వివరిస్తానన్నారు. మార్కాపురం జిల్లా, వెలుగొండ ప్రాజెక్ట్‌లపై మహానాడులో తీర్మానాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటా నన్నారు. మహానాడుకు అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చేలా చర్యలు చేపట్టాల న్నారు. సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలన్నారు. ముందుగా మాట్లాడిన జడ్పీటీసీ  మాజీ సభ్యుడు కందుల రామిరెడ్డి మార్కాపురం జిల్లా కోసం టీడీపీతో పాటు అఖిల పక్షం చేసిన పోరాటాలు, వెలుగొండ ప్రాజెక్ట్‌లో కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధం చేస్తున్న పనులను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం  రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మల్లికార్జున్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, నియోజకవర్గంలోని పార్టీ మండల అధ్యక్షులు షేక్‌ మౌలాలీ, జవ్వాజి రామాంజనేయులరెడ్డి, చిన్నపరెడ్డి, మీగడ ఓబులరెడ్డి, ఖుద్దూస్‌, ఎం.బాబూరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పుల శ్రీనివాసులు, కౌన్సిలర్‌ యేరువ వెంకట నారాయణరెడ్డి, టీడీపీ నాయకులు కాటూరి పెద్దబాబు, చిన్నబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్లు కాకర్ల శ్రీనివాసులు, చప్పిడి రామలింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:53:54+05:30 IST