ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2022-07-06T04:07:38+05:30 IST

బెల్లంపల్లి పట్టణాన్ని ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, కమిషనర్‌ గంగాధర్‌లు పేర్కొన్నారు. మంగళవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ 120 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్‌, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పట్టణంలో నిషేదించడం జరిగిందన్నారు.

ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా తీర్చిదిద్దాలి
బెల్లంపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కమిషనర్‌, కౌన్సిలర్లు

బెల్లంపల్లి, జూలై 5: బెల్లంపల్లి పట్టణాన్ని ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, కమిషనర్‌ గంగాధర్‌లు పేర్కొన్నారు. మంగళవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వారు మాట్లాడుతూ 120 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్‌, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పట్టణంలో నిషేదించడం జరిగిందన్నారు. ప్రజలు, వ్యాపారులు ప్లాస్టిక్‌ను వాడవద్దని సూచించారు. ప్లాస్టిక్‌ను వాడినా, అమ్మినా  జరిమానాలు విధిస్తామని తెలిపారు. ఇందుకోసం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ టీంను నియమించామన్నారు. ప్రతీ ఒక్కరు ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, కౌన్సిలర్లు లావణ్య, ఆస్మాషేక్‌, అశోక్‌గౌడ్‌, రమేష్‌, సురేష్‌, రవి, కో ఆప్షన్‌ సుశీల,  అధికారులు, ఆర్‌పీలు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-06T04:07:38+05:30 IST