త్వరలో మేకిన్‌ ఇండియా వీడియో యాప్

ABN , First Publish Date - 2020-07-07T06:56:31+05:30 IST

మేక్‌ ఇన్‌ ఇండియా వీడియో కాన్ఫరెన్స్‌ అప్లికేషన్‌ (యాప్‌) కోసం జరుగుతున్న పోటీకి 5 స్టార్ట్‌పలు షార్ట్‌లిస్ట్‌ అయ్యాయి. అందులో రెండు స్టార్ట్‌పలు హైదరాబాద్‌కు చెందినవి కావడం విశేషం...

త్వరలో మేకిన్‌ ఇండియా వీడియో యాప్

  • 5 స్టార్ట్‌పలు షార్ట్‌లిస్ట్‌ 
  • అందులో 2 హైదరాబాద్‌కు చెందినవే.. 

న్యూఢిల్లీ: మేక్‌ ఇన్‌ ఇండియా వీడియో కాన్ఫరెన్స్‌ అప్లికేషన్‌ (యాప్‌) కోసం జరుగుతున్న పోటీకి 5 స్టార్ట్‌పలు షార్ట్‌లిస్ట్‌ అయ్యాయి. అందులో రెండు స్టార్ట్‌పలు హైదరాబాద్‌కు చెందినవి కావడం విశేషం. అమెరికాకు చెందిన ప్రముఖ వీడియో యాప్‌ ‘జూమ్‌’కు ప్రత్యామ్నాయంగా దేశీయ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో గత నెల 13న కేంద్ర ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శాఖ ఈ పోటీని ప్రకటించింది. ఈ యాప్‌ డెవల్‌పమెంట్‌ పోటీకి 2,000కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అందులో 5 కంపెనీలను షార్ట్‌లిస్ట్‌ చేయడం జరిగిందని, అన్నీ స్టార్ట్‌పలేనని వారన్నారు. యాప్‌ అభివృద్ధి కోసమని ఈ జాబితాలోని టాప్‌-3 కంపెనీలకు ప్రభుత్వం రూ.20 లక్షల చొప్పున సమకూర్చుతుంది. మిగతా రెండు కంపెనీలకు రూ.15 లక్షల చొప్పున కేటాయించనుంది. 


షార్ట్‌లిస్ట్‌లోని స్టార్ట్‌పలు 

  1. పీపుల్‌లింక్‌ యూనిఫైడ్‌ కమ్యూనికేషన్స్‌  - హైదరాబాద్‌ 
  2. సర్వ్‌ వెబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌           - జైపూర్‌
  3. టెక్‌జెన్‌ట్సియా సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌           - అలెప్పీ
  4. ఇన్‌స్ట్రైవ్‌ సాఫ్ట్‌ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ - చెన్నై 
  5. సోల్‌పేజ్‌ ఐటీ సొల్యూషన్స్‌     - హైదరాబాద్‌ 


2,000 మందితో వీడియో కాన్ఫరెన్సింగ్‌!

జైపూర్‌కు చెందిన డేటా ఇంజీనియస్‌ గ్లోబల్‌ సంస్థ ‘వీడియో మీట్‌’ పేరుతో యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ వీడియో యాప్‌ ఒకే సెషన్‌లో 2,000 మందితో వీడియో కాన్ఫరెన్సింగ్‌కు సపోర్ట్‌ చేయగలదని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ యాప్‌ సేవలెవరికైనా ఉచితమని, దీని ద్వారా ఏకంగా పొలికట్‌ ర్యాలీని సైతం నిర్వహించవచ్చని డేటా ఇంజీనియస్‌ గ్లోబల్‌ వ్యవస్థాపకులు, సీఈఓ అజయ్‌ తెలిపారు. 


Updated Date - 2020-07-07T06:56:31+05:30 IST