గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి

ABN , First Publish Date - 2021-01-19T05:16:38+05:30 IST

ఈనెల 26న గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె శశాంక జిల్లా అధికారులను ఆదేశించారు.

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కె శశాంక


 కలెక్టర్‌ కె శశాంక

కరీంనగర్‌, జనవరి 18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఈనెల 26న గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె శశాంక జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గణతంత్ర వేడుకలనిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో గణతంత్ర వేడుకలను కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుటకు తగుఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చుటకు వివిధ పాఠశాలల విద్యార్థులను ఎంపిక చేయాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్‌లాల్‌, నరసింహారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరుక్రాంతి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటమాధవరావు, తదితరులు పాల్గొన్నారు.


సమస్యల సత్వర పరిష్కారానికే డయల్‌ యువర్‌ కలెక్టర్‌..


డయల్‌ యువర్‌కలెక్టర్‌లో వచ్చిన ప్రజాసమస్య లకు అధిక ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని కలెక్టర్‌ కె శశాంకఅన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలనుంచి 12మంది ఫోన్‌ చేసి ఫిర్యాదులు చేయగా సంబంధితశాఖల అధికా రులు పరిష్కరించాలని ఆదేశించారు.


వ్యాక్సిన్‌పై నమ్మకం కలిగించాలి..


కరీంనగర్‌ రూరల్‌: వైద్యసిబ్బంది ముందుగా వ్యాక్సిన్‌ తీసుకుని కొవిడ్‌ నివారణ టీకాపై ప్రజలకు నమ్మకం కలిగించాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. సోమవారం కొత్తపల్లి ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మున్సిపల్‌చైర్మన్‌ రుద్రరాజు ప్రారం భించగా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వ హించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డీఎంహె చ్‌వో డాక్టర్‌సుజాత మాట్లాడుతూ జిల్లాలోని 12 కేంద్రాల్లో కొవిన్‌ఆప్‌లో నమోదుచేసుకున్న 600 మంది వైద్యసిబ్బందికి కొవిడ్‌వ్యాక్సినేషన్‌ చేస్తామ న్నారు. ఇప్పటి వరకు టీకా వేయించుకున్న వారి ఆరోగ్యపరిస్థితి బాగుందన్నారు. మొదటిరోజు 41 మందికి వ్యాక్సిన్‌ అందించగా మొదటివ్యాక్సిన్‌ను పీహెచ్‌సీ డాక్టర్‌ వంశీకృష్ణ మోహన్‌ తీసుకున్నారు. ఎంపీపీలుపిల్లిశ్రీలత,తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీలు పిట్టల కవిత, పురుమల్ల లలిత, మున్సిపల్‌ కమిష నర్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


విజేతలను అభినందించిన కలెక్టర్‌..

కరీంనగర్‌ టౌన్‌: స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ విజేతలు కె గంగజల, శ్రీవల్లి, ఎస్‌ సుభాచరణ్‌ను కలెక్టర్‌ ఆయన ఛాంబర్‌లో అభినందించారు.

Updated Date - 2021-01-19T05:16:38+05:30 IST