విద్యా సంస్థల్లో ఏర్పాట్లు చేయండి

ABN , First Publish Date - 2021-01-14T07:48:26+05:30 IST

విద్యాసంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని షెడ్యూల్‌ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులను

విద్యా సంస్థల్లో ఏర్పాట్లు చేయండి

విద్యార్థులకు అవసరమైనవన్నీ అందించాలి: కొప్పుల


హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): విద్యాసంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని షెడ్యూల్‌ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులను ఆదేశించారు. గురుకుల పాఠశాలలు, పరిసరాలు, తరగతి, వంట గదులను శుభ్రం చేయించాలని, నిత్యావసర, ఇతర వస్తువులు సకాలంలో అందేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, కొవిడ్‌ నిబంధనల మేరకు తరగతి గదులను శానిటైజ్‌ చేయించి, పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యాసంస్థల ప్రారంభంపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయాలని అధికారులను కొప్పుల ఆదేశించారు. కాగా, హైదరాబాద్‌ రెహ్మత్‌నగర్‌లోని సెంటర్‌ ఫర్‌ దళిత్‌ స్టడీస్‌ కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ బుఽధవారం సందర్శించారు. రూ. 26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సెంటర్‌ను అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. సివిల్స్‌ కోసం చదువుకునే వారికి ఈ సెంటర్‌లో అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌, గువ్వల బాల రాజు, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కాలె యాదయ్య, మాగంటి గోపీనాథ్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌ ఉన్నారు. 

Updated Date - 2021-01-14T07:48:26+05:30 IST