ప్రభుత్వ సర్వీసులోకి తీసుకునేలా కృషి చేయండి

ABN , First Publish Date - 2021-04-16T07:22:23+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మినిమన్‌ సర్వీసు లే కుండా ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని రిటైర్డ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ సర్వీసులోకి తీసుకునేలా కృషి చేయండి
ఎమ్మెల్యే రేఖానాయక్‌కు వినతిపత్రం అందజేస్తున్న రిటైర్డ్‌ ఉద్యోగులు

ఎమ్మెల్యే రేఖానాయక్‌కు రిటైర్డ్‌ ఉద్యోగుల వినతి

ఖానాపూర్‌, ఏప్రిల్‌ 15 : ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మినిమన్‌ సర్వీసు లే కుండా ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకునేలా చర్యలు చేపట్టాలని రిటైర్డ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాము 2020 జూలై మాసంలో ఉద్యోగ విరమణ పొం దామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభలో చేసిన పీఆర్‌సీ ప్రకటనలో ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 61 ఏళ్లకు పెంపొందించడం తో పాటు ఈ ఏడాది మార్చి నుండి అది వర్తిస్తుందని ప్రకటించారన్నారు. దీంతో తమకు ఆ వెసులుబాటు వర్తించక తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. తమను కూడా ప్రభుత్వ సర్వీసులోకి తీసుకునేలా కృషి చేసి తమ కుటుంబాలకు అండగా నిలువాలని రిటైర్డ్‌ ఉద్యోగులు ఎమ్మెల్యే రేఖానాయక్‌ను కోరా రు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు వెంకట్రమణ, ఐతం శంకర్‌, రాజేశ్వర్‌, నర్సింగ్‌రావు, లచ్చన్న, రాములు, రవికుమార్‌ తదితరులున్నారు. 


Updated Date - 2021-04-16T07:22:23+05:30 IST