మాట్లాడుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 16: హైద్రాబాద్‌లో ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకు జరిగే ఏఐటీయూసీ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలను విజయ వంతం చేయాలని ఏఐటీ యూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ పేర్కొన్నారు. ఆది వారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు లేకుండా బీజేపీ కుట్రలు చేస్తుందని, కార్మిక వర్గాన్ని రోడ్డున పడేస్తూ చౌక ధరలకు ప్రభుత్వ ఆస్తులను అమ్ముతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకంగా జాతీ య కార్మిక సంఘాల నాయకత్వంలో ఫిబ్రవరి 23, 24 తేదీల్లో జరిగే దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దసాఉ, నాయకులు రామడుగు లక్ష్మణ్, సరస్వతి, బాజీసైదా, సుదర్శన్, సమ్మయ్య, కిషన్‌రావు, దాగం మల్లేష్‌లు పాల్గొన్నారు.