మకర చౌలా

ABN , First Publish Date - 2021-01-09T15:47:04+05:30 IST

బాస్మతి బియ్యం - ఒక కప్పు, పాలు - ఒకటిన్నర కప్పు, కొబ్బరి తురుము - ముప్పావు కప్పు, అరటిపండ్లు - మూడు, ఆపిల్‌ ముక్కలు - పావు కప్పు, పంచదార - ముప్పావు కప్పు

మకర చౌలా

ఓడిశా ప్రజలు సంక్రాంతి రోజున చేసుకునే సంప్రదాయ వంటకం ఇది.


కావలసినవి: బాస్మతి బియ్యం - ఒక కప్పు, పాలు - ఒకటిన్నర కప్పు, కొబ్బరి తురుము - ముప్పావు కప్పు, అరటిపండ్లు - మూడు, ఆపిల్‌ ముక్కలు - పావు కప్పు, పంచదార - ముప్పావు కప్పు, దానిమ్మ గింజలు - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం: బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి మూడు నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. తరువాత నీళ్లు తీసేసి మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి. కొబ్బరి తురుము, పాలు వేసి మరోసారి గ్రైండ్‌ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆపిల్‌ ముక్కలు, పంచదార, దానిమ్మగింజలు, యాలకుల పొడి, మిరియాల పొడి వేసి కలపాలి. అరటి పండు ముక్కలు వేసి మకర చౌలాను సర్వ్‌ చేయాలి. 

Updated Date - 2021-01-09T15:47:04+05:30 IST