కీలక కమిటీలో చోటు దక్కించుకున్న ఇండియన్-అమెరికన్

ABN , First Publish Date - 2020-12-02T23:44:47+05:30 IST

అగ్రరాజ్య అధినేతగా ఎన్నికైన జో బైడెన్.. ఇండియన్-అమెరికన్‌కు ఓ కీలకమైన కమిటీలో చోటు కల్పించారు. వివరాల్లోకి వెళితే.. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై జో బైడెన్ ఘన విజయం సాధించిన విష

కీలక కమిటీలో చోటు దక్కించుకున్న ఇండియన్-అమెరికన్

వాషింగ్టన్: అగ్రరాజ్య అధినేతగా ఎన్నికైన జో బైడెన్.. ఇండియన్-అమెరికన్‌కు ఓ కీలకమైన కమిటీలో చోటు కల్పించారు. వివరాల్లోకి వెళితే.. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై జో బైడెన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.  ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు. అయితే బైడెన్ మాత్రం ట్రంప్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే నాలుగురు సభ్యులతో ప్రెసిడెన్షియల్ ఇనాగురల్ కమిటీ (పీఐసీ)ని ఏర్పాటు చేశారు.


ఇందులో భారతీయ అమెరికన్ మజు వర్గేసేకు జో  బైడెన్ చోటు కల్పించారు. నలుగురు సభ్యుల కమిటీలో మజు వర్గేసేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. పీఐసీలో చోటు దక్కడంపట్ల మజు వర్గేసే స్పందించి ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా మజు వర్గేసే.. జో బైడెన్-కమలా హారిస్ క్యాంపెయిన్‌లో క్రియాశీలకంగా పని చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలో కూడా ఆయన కీలక పదవుల్లో పని చేశారు. 

Updated Date - 2020-12-02T23:44:47+05:30 IST