Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 30 Jun 2022 16:11:29 IST

ఓటీటీలోకి Major.. ఎప్పుడంటే.. !

twitter-iconwatsapp-iconfb-icon

టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) నటించిన ఆసక్తికరమైన బయోపిక్ ‘మేజర్’ (Major). కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత విశేషాల్ని తెరపై ఎంతో ఎమోషనల్ గా ఆవిష్కరించాడు దర్శకుడు శశికిరణ్ తిక్క (Shashikiran Thikka). జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా తొలి రోజునుంచే పాజిటివ్ టాక్  సొంతం చేసుకుంది. సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఎంతో సహజంగా ప్రేక్షకుల కళ్ళకు కట్టాడు దర్శకుడు. ఆయన పాత్రలోకి అడివిశేష్ పరకాయ ప్రవేశం చేసి.. ఎమోషనల్ గా కదిలించాడు. 


ఈ సినిమాకి సినీ ప్రముఖుల నుంచి ఎన్నో ప్రశంసలు దక్కాయి. టీజర్, ట్రైలర్ తో విడుదలకు ముందే ఆసక్తి రేపిన ఈ సినిమా.. ప్రేక్షకుల అంచనాల్ని అధిగమించి మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కు రెడీ అవడం విశేషం. జూలై 3న నెట్ ఫ్లిక్స్ లో మేజర్ చిత్రం స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు. తెలుగు, హిందీ , మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది. సయీ మంజ్రేకర్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. థియేట్రిక్ రిలీజ్ కు సరిగ్గా నెల రోజుల తర్వాత మేజర్ ఓటీటీలోకి రాబోతుండడం విశేషమని చెప్పాలి. మరి ఓటీటీలో మేజర్ చిత్రానికి ఇంకెంత ఆదరణ దక్కుతుందో చూడాలి. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement