బెంగళూరు: పక్కపక్క రన్‌వేలపై నుంచి రెండు విమానాలు ఒకేసారి ఒకే దిశలో ఎగిరాయి. ఈ క్రమంలో అవి మూడువేల అడుగుల ఎత్తు వెళ్లాయి. తర్వాత ఒకదానికొకటి ఎదురెదురుగా వెళ్తున్నాయి. కొన్ని క్షణాలు ఆలస్యమయ్యుంటే అవి రెండూ ఢీకొట్టుకుని భారీ ప్రాణనష్టం సంభవించేది. సరైన సమయంలో అప్రోచ్ రాడార్ కంట్రోలర్ స్పందించి అప్రమత్తం చేయడంతో 426 మందికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ నెల 7న బెంగళూరులో ఈ ఘటన జరిగింది. 6ఈ-455 అనే ఇండిగో విమా నం బెంగళూరు నుంచి కోల్‌కతాకు, 6ఈ-246 అనే మరొక ఇండిగో విమా నం బెంగళూరు నుంచి భువనేశ్వర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఇవి కూడా చదవండి